Sunday, April 28, 2024

సేఫ్టీ కార్లకే ప్రియారిటీ..

తప్పక చదవండి

ఇప్పుడు ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. సుదూరం ప్రయాణం చేయాలంటే కారులో సేఫ్టీ ఫీచర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్‌లపైనే కస్టమర్లు మనస్సు పారేసుకుంటున్నారని స్కోడా ఆటో ఇండియా, ఎన్ఐక్యూ బేసేస్ సంస్థలు సంయుక్తంగా నిర్వంచిన సర్వేలో తేలింది. ప్రతి పది మందిలో తొమ్మిది మంది సేఫ్టీ ఫీచర్లు, వాటికి ఇచ్చే ర్యాంకింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అటుపై ఫ్యుయల్ మైలేజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. 67 శాతం మంది సేఫ్టీ రేటింగ్ వేరియంట్లకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు కారు కొనని వారు 37 శాతం మంది వచ్చే ఏడాదిలోగా రూ.5 లక్షల్లోపు ధర కల ఎంట్రీ లెవల్ కారును కొనాలని భావిస్తున్నట్లు చెప్పారు. 18-54 ఏండ్ల మధ్య వయస్సు గల వారితో ఈ సర్వే నిర్వహించారు. 80 శాతం మంది పురుషులు, 20 శాతం మంది మహిళలు ఉన్నారు. కార్లు కొనాలనుకునే వారు.. ఆయా కార్ల క్రాష్ రేటింగ్‌పై 22.3 శాతం మంది.. వాటిల్లో వాడే ఎయిర్ బ్యాగ్స్ గురించి 21.6 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. 15 శాతం ఫ్యుయల్ మైలేజీకి ప్రాధాన్యం ఇస్తున్నారు.

పది రాష్ట్రాల్లో వెయ్యి మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు సర్వేలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు