Sunday, May 19, 2024

జనగామ జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్, వెంటిలేటర్ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లికి జేఏసీ వినతి పత్రం..

తప్పక చదవండి
  • హాస్పిటల్ డాక్టర్స్ ప్రైవేట్ గా సీటీ స్కాన్ సెంటర్స్ నడుపుతున్నారు..
  • రేట్ కూడా ఇష్టం వచ్చినట్టు ఒక్కొరికీ ఒక్కోరకంగా వసూలు..

జనగామ ప్రజలకు ప్రభుత్వ సీటీ స్కాన్, వెంటిలేటర్ సౌకర్యాలు ఎప్పుడు వస్తాయి..? ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు అంటూ సూటిగా జనగామ జేఏసీ సూటిగా ప్రశ్నించింది.. జనగాం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మేడిపండు లాంటిది. మెడి పండు చుడు మేలిమై ఉండును,, పొట్ట విప్పి చూడు పురుగులుండును.. ఆన్న చందంగా ఉంటుంది.. ఒక వెంటిలేటర్ లేదు.. పేషెంట్ వస్తే చూసుకునే వారు ఉండరు.. ఒక అంబులెన్స్ సేవలు ఉండవు.. సీటీ స్కాన్ కూడా లేదు..

జనగామ జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాలు లేక జనగామ ప్రజలు వరంగల్, హైదరాబాద్ నగరాలకు వెళ్లి ఎంజీఎం, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులలో వైద్యం చేసుకునే దుస్తితి ఏర్పడిందని, జనగామ జిల్లాకి మెడికల్ కాలేజీ మంజూరు అయినా కూడా ప్రభుత్వం సీటీ స్కాన్, వెంటిలేటర్ వసతులు కల్పించకపోవడం ఏంటని, వెంటనే జనగామ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఎర్రబెల్లిని జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు కోరారు.. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రంగు ప్రవీణ్, మహ్మద్ అబ్బాస్, తుంగ కౌశిక్, సల్ల మహేష్, కడకంచి మల్లేష్ పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు