Tuesday, March 5, 2024

ఐటీఆర్‌ దాఖలు చేయాలి..

తప్పక చదవండి
  • సూచించిన రెవెన్యూ కార్యదర్శి మల్హోత్రా..

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్‌లను త్వరగా దాఖలు చేయాలని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా కోరారు. గడువు సమీపిస్తుందని, ఇకపై పొడిగించే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. జాతీయ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది కంటే ఎక్కువగా ఫైలింగ్‌ జరుగుతుందని భావిస్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఐటీఆర్‌ ఫైలింగ్‌ చాలావేగంగా ఉందని, రిటర్న్‌లు దాఖలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిజేస్తున్నామన్నారు. చివరి క్షణం వరకు ఆగవద్దని, గడువు ముగింపు వరకు వేచిచూడొద్దని, పొడిగింపు ఉండవచ్చని ఆశించొద్దన్నారు. 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు జులై 31వ తేదీతో గడువు ముగుస్తుందని, వీలైనంత త్వరగా రిటర్నులను దాఖలు చేయాలని సూచించారు. వస్తు, సేవల పన్ను వృద్ధి రేటు విషయానికి వస్తే ఇది ఇప్పటి వరకు 12శాతంగా ఉందని తెలిపారు. రేట్ల తగ్గింపు కారణంగా ఎక్సైజ్‌ రంగంలో వృద్ధి రేటు 12శాతం కంటే తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతానికి చాలా ప్రతికూలంగా ఉందని, ముందుకెళ్తున్న కొద్దీ పన్ను రేటు తగ్గింపు తర్వాత ఎక్సైజ్‌ సుంకం వసూళ్లలో వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు