Monday, September 9, 2024
spot_img

గ్రామ పంచాయితీ కార్మికుల పట్లఇంత నిర్లక్ష్యమా?

తప్పక చదవండి
  • బంగారు తెలంగాణ అంటే ఇదేనా
  • యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి..

భూధన్‌ పోచంపల్లి : మున్సిపల్‌ పట్టణ కేంద్రంలో గత ఐదు రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. సోమవారం సాయంత్రం డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి వారికి సంఫీుభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, కరోనా సమ యంలో వాళ్ళ ధైర్యసహ సాలు ఎప్పటికీ మరువలేనివి ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాణి సమయంలో పారిశుద్ధ కార్మికులు ఊరుని భాగోవులు చూసుకుంటూ పరిశుభ్రంగా ఉంచారు. కేంద్రం ప్రభుత్వం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్వచ్ఛభారత్‌ గా పిలవబడుతుందంటే అది పాడిశుద్ధ్య కార్మికులతోనే గ్రామాలకు అవార్డు వస్తుందంటే కేవలం గ్రామపంచాయతీ కార్మికులతోనే సాధ్యమవుతుంది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని అంటున్నారు మరి కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకువహిస్తున్నారు. కనీసం సమాన వేతనం ఉండాలి రోజుకు నిత్యవసరాలు రోజురోజుకు పెరిగిపోతున్నవి ధనిక రాష్ట్రం అంటే ఇదేనా, ప్రతి ఒక్క గవర్నమెంట్‌ ఉద్యోగునికి లక్షల, వేలలో జీతాలు ఉంటే గ్రామాన్ని కాపాడుకోవాల్సిన గ్రామ పంచాయతీల కార్మికుల జీతాలు మాత్రం ఇంత దారుణంగా ఉంటాయా.గ్రామపంచాయతీలు కార్మికులు, మధ్యాహ్నం భోజన కార్మికులు ప్రభుత్వానికి కనిపించడం లేదా ఎన్ని రోజులు ఈ వ్యక్తి చాకిరి ఇంకా కార్మికులను వెంటనే ఆదుకోవాలని వారి జీతభత్యాలు పెంచాలని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఆదుకోవాలి. కార్మికుల పట్ల కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు తడక వెంకటేష్‌, పోచంపల్లి మండల అధ్యక్షులు పాక మల్లేష్‌ యాదవ్‌, మున్సిపల్‌ టౌన్‌ అధ్యక్షులు భారత లవకుమార్‌,వంకమామిడి గ్రామ సర్పంచ్‌ బొడిగ శంకరయ్య, పిలాయిపల్లి ఉపసర్పంచ్‌ పడాల సతీష్‌ చారి,మండల ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్‌,పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు ప్రకాష్‌ రెడ్డి,కళ్లెం రాఘవరెడ్డి, టింకిల్‌ కార్‌ వెంకటేష్‌, , ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు