Sunday, May 19, 2024

ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్ చాంపియ‌న్‌గా భార‌త్..

తప్పక చదవండి

భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు సంచ‌ల‌నం సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. భువ‌నేశ్వ‌ర్‌లోని క‌లింగ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన టైటిల్ పోరులో లెబ‌నాన్‌ పై 2-0తో గెలుపొందింది. దీంతో ఇంటర్ కాంటినెంటల్ కప్ లో విజేతగా నిలిచిన భారత పురుషుల ఫుట్ బాల్ జట్టుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు జట్టుకు రూ.కోటి నగదు బహుమానం ప్రకటించారు.

‘ప్రతిష్టాత్మకమైన ఇంటర్ కాంటినెంటల్ కప్ కు ఆతిథ్యమివ్వడం మన రాష్ట్రం గవ్వించదగ్గ విషయం. గట్టి పోటీని ఎదుర్కొంటూ భారత పురుషుల జట్టు విజయం సాధించినందుకు అభినందనలు. ఒడిశాలో మరెన్నో ఫుట్ బాల్ ఈవెంట్ లు నిర్వహించి క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందించాలనేది మా ఉద్దేశం’ అని నవీన్ పట్నాయక్ తెలిపారు.

- Advertisement -

భువ‌నేశ్వ‌ర్‌లోని క‌లింగ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన టైటిల్ పోరులో లెబ‌నాన్‌ పై 2-0తో గెలుపొందింది. స్టార్ ఆట‌గాడు సునీల్ ఛైత్రీ 46వ నిమిషంలో జ‌ట్టుకు తొలి గోల్ అందించాడు.66వ నిమిషంలో ల‌ల్లియంజుల ఛాంగ్టే రెండో గోల్ సాధించాడు. దాంతో, భార‌త ఆట‌గాళ్లు గెలుపు సంబురాలు చేసుకున్నారు. ఇరుజ‌ట్లు ఇంత‌కుముందు త‌ల‌ప‌డిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి అర్ధ‌భాగంలో ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ఒక్క గోల్ చేయ‌లేదు. రెండో అర్ధ భాగం మొద‌లైన కాసేప‌టికే కెప్టెన్ ఛైత్రీ గోల్ కొట్టడంతో భార‌త్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ల‌ల్లియంజుల మ‌రో గోల్ సాధించ‌డంతో టీమిండియా విజ‌యం ఖ‌రారైంది. దీంతో రెండోసారి నాలుగు దేశాల ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్ చాంపియ‌న్‌గా భారత హాకీ జట్టు అవ‌త‌రించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు