Saturday, July 27, 2024

ధమాకా జోడీ రిపీట్‌..

తప్పక చదవండి

పొగడ్తల వర్షం కురిపించుకున్న జోడీ మరోసారి తెరపై కనువిందు చేస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం అదే జోడీ రెండోసారి రిపీట్‌ కావడానికి సిద్ధమైంది. గతేడాది చివర్లో వచ్చిన ధమాకా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిర్మాతల పాలిట కామధేనువుల కాసుల వర్షం కురిపించింది. వరుస వైఫల్యాలతో నిరాశలోన్న రవన్న ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక శ్రీలీలకు ఈ సినిమా నక్క తొక తొక్కినట్టయింది. ధమాకా తర్వాత శ్రీలీలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమా చాన్స్‌లు వచ్చాయి. ఇక ఈ సినిమాలో వీరిద్దరూ కనిపించిన ప్రతీ సీన్‌ హైలేటే. ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిస వేసిన స్టెప్పులకు థియేటర్‌లే దద్దరిల్లిపోయాయి. ఈ జోడీకి ప్రేక్షకులు కూడా పట్టం కట్టారు. కాగా రవితేజ, గోపిచంద్‌ మలినేనితో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను ఫిక్సయ్యారట. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సంక్రాంతికి వీరసింహా రెడ్డితో విజయ పతాకం ఎగురవేసిన గోపిచంద్‌ మలినేని-మైత్రీ మరోసారి జోడీ కట్టడంతో సినిమాపై మంచి హైప్‌ వచ్చింది. పైగా క్రాక్‌ తర్వాత రవితేజ్‌తో గోపిచంద్‌ మరోసారి చేతులు కలపడంతో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు