Wednesday, May 22, 2024

లాభాల బాటలో ఇండియన్ స్టాక్ మార్కెట్లు..

తప్పక చదవండి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలై.. రోజంతా లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. చివరలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల్లుపై ఓటింగ్ నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్‌ ముగిసే సరికి చివరకు 122.75 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 35.2 పాయింట్లు పెరిగి.. 18,633.85 వద్ద ముగిసింది. మంగళవారం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌ సర్వీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌సీఎల్‌ అత్యధికంగా లాభపడ్డాయి. హిందాల్కో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా నష్టపోయాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు