Wednesday, October 16, 2024
spot_img

భారత విప్లవొద్యమ కెరటం కటకం సుదర్శన్

తప్పక చదవండి

నేల రాలిన గేరిల్లా యోధుడు
ఆయన దండకారణ్యం లో విప్లవ బాటలు వేసిండు, జనత న సర్కార్ వంటి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పరిచ్చిండు, గని కార్మిక వర్గానికి పోరాట దారులు నిర్మించిండు, రాష్ట్రాలను దాటి దేశంలో విప్లవ పోరాట మార్గాలను వేసిండు, దేశంలోఎర్ర సైన్యానికి గే్రిల్లా యుద్ధ తంత్రాలను నేర్పిండు. దేశంలో విప్లవ నిర్మాత ల్లో ఒకరు. భారత విప్లవ కెరటం కటకం సుదర్శన్ ఆకస్మిక మరణం దేశంలో విప్లవ పోరాటాలకు,విప్లవొద్యమాలకు తీరని లోటు. సుదర్శన్ మరణ వార్త తెలంగాణ తో పాటు నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాలు ఉలికి పాటుకు గురయ్యాయి. అయన ఐదు దశబ్దాల పాటు పూర్తి గా విప్లవనిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేసి పనిచేసాడు. మావోయిస్టు కేంద్ర కమిటీ లో సీనియర్ పొలట్ బ్యూరో సభ్యుడు. సెంట్రల్ రీజినల్ బ్యూరో కార్యదర్శి, సుదర్శన్ మే 31న అనారోగ్యం తో మరణించి నట్లు ఆ పార్టీ ప్రకటించడం తో పీపుల్స్ వార్ లో ఒక శకం ముగిసినట్లయింది. సుదర్శన్ తొలితరం నాయకుల లో ఒకరు. కరీంనగర్ జిల్లా నుండి ముప్పాల్ల లక్ష్మణ్ రావు,నల్లా ఆదిరెడ్డి మల్లొజల కోటేశ్వర్ రావు,వేణుగోపాల్లాగే ఆదిలాబాద్ జిల్లానుండి కటకం సుదర్శన్, గజ్జల గంగారాం లు కొండపల్లి సీతారామయ్య తో కలిసి పీపుల్స్ వార్ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు. సింగరేణి కార్మికుడు కటకం మల్లయ్య కుమారుడైన సుదర్శన్ 1974-75లలో పాలిటెక్నిక్ డిప్లమా చదువుతూనే విప్లవ పార్టీ నిర్మాణం కోసం పనిచేయడం ప్రారంభించాడు. శ్రీకాకుళం ఉద్యమం మిగిసినంక ,1977ఎమరజన్సీ తర్వాత తెలంగాణ లోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా లలో మొదలయినా విప్లవ పోరాటాలకు అంకురార్పణ చేసిన వారిలో సుదర్శన్ ముక్యుడు. నల్లా ఆదిరెడ్డి తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు తొలి వార్ జిల్లా కార్యదర్శి గా సుదర్శన్ నియమించ బడ్డాడు. బెల్లంపల్లి లో 1978 జరిగిన గుండాల జంట హత్యల తర్వాత అప్పటినుండి సుదర్శన్ అజ్ఞాత ప్రారంభించి 2023 మే 31మరణించే వరకు అయన ఆజ్ఞత జీవితమే గడిపిండు తొ లుత జన్నారం ప్రాంత ఆర్గనైసర్,1980తర్వాత జిల్లా కార్యదర్శి గా మొదలు కొని కేంద్ర కమిటీ లో ముఖ్య నాయకుని గా, వ్యూహకర్త గా, గే్రిల్లా యుద్ధ తంత్రం లో ధీటుగా ఎదిగి దేశంలో మోస్ట్ పాపులర్ నక్సలైట్ నాయకుని గా ఆనంద్ అనేక సంచలనా లను సృష్టించిండు.1981లో దేశంలో నే అతిపెద్ద గిరిజన పోరాట మైన ఇంద్రవెల్లి పోరాటాన్ని సుదర్శన్ ప్రత్యక్షంగా పాల్గొని నడిపించిండు. గిరిజన రైతు కూలి సంఘాన్ని ఏర్పాటు చేసి ఆదివాసుల హక్కుల కోసం గిరిజనులకదిలించి, పోరాటాలను నిర్మించిండు. అయన అనుసరించే వ్యూహాలు, ఎత్తు గడలు ప్రభుత్వల ను ముప్పు తిప్పలు పెట్టాయి. తన 48ఏళ్ల అజ్ఞాత జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ లకు చిక్కక పోవడ0. అయన నిబద్దత, టెక్ పద్ధతుల పాటించే విధానం ఆయనదిట్ట.
1980లో సిరివోంచ వద్ద జరిగి న తొలి ఎన్కౌంటర్ లో పెద్ది శంకర్ మరణించగా దళ నాయకుడైన సుదర్శన్ తప్పించు కున్నాడు.1987లో హైదరాబాద్ రాంనగర్ లో వార్ అగ్ర నేతలు ఆదిరెడ్డి సహా పలువురు అరెస్ట్ కాగా అసంఘటన నుండి సుదర్శన్ చాక చక్యంగా తప్పించుకున్నాడు.1995లో సిర్పూర్ వద్ద జరిగిన ఎన్కౌంంటర్ ఘటనలొ ఆనంద్ చనిపోయినట్లు పోలీస్ లు ప్రకటించారు. దీనితో కుటుంబ సభ్యులు ఇంట్లో కర్మ ఖాండ లు కూడా చేసారు. కానీ తర్వాత కొద్ది రోజుల కు తాను బతికే ఉన్నట్లు ప్ర కటించి సుదర్శన్ సంచలనం సృష్టించాడు. సుదర్షన్ భార్య లలిత క్క ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి గా పనిచేస్తున్న సమయం లోనే 1997లో సిర్పూర్ సమీపంలోజరిగిన ఎన్కౌంటర్ లో మరణించినది.48సంవత్సరాలసుధీర్ఘ ఆజ్ఞత జీవితం లో అనేక దశ లలో పని చేసిండు. ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గా, ఆల్ ఇండియా స్పెషల్ సె షన్ కమిటీ కేంద్ర కమిటీ సభ్యుని గా, సెంట్రల్ రేజినల్ బ్యూరో కార్యదర్శి గా పని చేయడం కాకుండా దేశంలో నీ ఎం సిసి ఐ, పార్టీ యూనిట్ వంటి విప్లవ సంస్థల ను ఒక్కటి గా చేసి పీపుల్స్ వార్ లో విలీనం చేసి మావోయిస్టు పార్టీ గా ఏర్పాటు చేయడం లో అయన ముఖ్య మైన పాత్ర పోశించి నట్లు ప్రచారం జరిగింది.చట్టీస్గడ్ రాష్ట్రం లో జనత న సర్కార్ పేరిట ప్రత్యమ్నాయ ప్రభుత్వన్ని నడపడం లోప్రధాన భూమిక ను ఆనంద్ పోషించాడు.
ఆదిలాబాద్ జిల్లా లో జరిపిన కరువు దాడులు గిరిజన పోరాటాల,రహస్య కార్యకలాపాలనేపథ్యంలో అయన పులి ఆనంద మోహన్ పేరిట రాసిన “వసంత గీతం “నవల ఎంతో పాపులర్ అయ్యింది. ఒక శకం ముగిసింది.

తొలి విప్లవ కారులంతా ఒక్కొక్కరు నేల కోరుగుతూ వస్తుండగా మిగిలిన ఒకేఒక్క విప్లవ దిగ్గజం కటకం సుదర్శన్ సుదీర్ఘ అజ్ఞాత వాసం లో ఎన్నో సంఘటన లు ఎదుర్కొని చివరి కి ఇలా అనారోగ్యం తొ, ఆకస్మికంగా నేల కొరగడం తో కోల్ బెల్ట్ ప్రాంత ఆనంద్ అభిమానులు, సానుభూతి పరులు దిగబ్రాంతి చెందరు. 1977ప్రాంతం లో బెల్లంపల్లి నుండి మొట్ట మొదటి రాడికల్ నాయకులు గా కటకం సుదర్శన్, గజ్జల గంగారాం లు విప్లవ బిజా లు నాటారు. ఎమర్జె న్సీ లో బా క్సర్ శ్రీనివాస్, జైలుకు పోగా, సుదర్శన్, గంగారాం లు ఆజ్ఞతంగా ఉంటూ రహస్య జీవితం గడిపారు. అతర్వాత పార్టీ యూనిట్ ను ఏర్పాటు చేసి నల్ల ఆదిరెడ్డి తో పాటు సుదర్శన్, గంగారాం లు తొలి వార్ జిల్లా కమిటీ గా ఏర్పడి కొండపల్లి నేత్రుత్వం లో విప్లవ కార్యకలాపాలు నడిపారు. వీరితో పాటు బెల్లంపల్లి కి చెందిన పులి మధునయ్య,పెద్ది శంకర్,గంధం రామస్వామి, బందేల రాములు, మొగిలి, మేరుగు సత్య నారాయణ, కట్కూరి సత్య నారాయణ, పాముల రాంచేందర్, కొప్పుల భస్కర్, కుమార్ తదితరులు పార్టీ ముఖ్య సభ్యులు గా పనిచేసారు. అయితే బెల్లంపల్లి నుండి మొదటి సారి ఆజ్ఞతము లోకి పోయి పార్టీ కి నాయకత్వం వహించిన వారి లో కటకం సుదర్శన్ ప్రధము డు. ఇందులో 1980నవంబర్ 2లో తొలి సారి జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో పెద్ది శంకర్ మరణించారు. ఆ ఘ టన నుండి సుదర్శన్ తృటి లొ తప్పించు కున్నారు. ఆతర్వ త 1981సెప్టెంబర్ లో బాంబు పెలి న సంఘటన లో గజ్జ ల గంగారాం మృతి చెందా రు.1985లొ సిర్పూర్ తాలూకా లొ జరిగిన ఎదురు కాల్పుల లొ పులి మధునయ్య మరణించగా 1999లొ కొయ్యురు దగ్గర రాష్ట్ర నాయకుడు నల్ల ఆదిరెడ్డి నీ పోలీస్ లుఎన్కౌంటర్లో చంపారు. బెంగాల్ లో మల్లొజల కోటేశ్వర్ రావు వంటి దిగ్గజం నెలకొరిగాడు. అప్పటి తరానికి చెందిన చాలా మంది లొంగి పోయి బయటికి వచ్చి సాధారణ జీవితం గడుపు టుండగా, అనేక మంది నాయకులు ఎన్కౌంటర్ లలో, అసువులు బాశారు. కటకం సుదర్శన్ తన సుదీర్ఘ ఆజ్ఞత జీవితంలో ఎన్నడూ పోలీస్ ల చేతికి చిక్కకుండా, తాను ఎంచుకున్న మార్గం లొ నమ్మిన సిద్ధాంతం కోసం, పేద ప్రజల కోసం, విప్లవ సంస్థ నిర్మాణం కోసం చివరి దాకా నిలబడి తెలుగు రాష్ట్రం నుండి దేశవ్యాప్తంగా విప్లవ పార్టీ ని విస్తరించి తన ఆశయ సాధన లొ తుది శ్వాస విడిచి ఒక గొప్ప విప్లవ నాయకుని గా చరిత్ర సృష్టించాడు. సుదర్శన్( ఆనంద్ )అమరత్వం తో ఒక శకం ముగిసింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు