Saturday, April 20, 2024

రాజకీయ పార్టీల్లో ‘కుల వివక్ష’త….?

తప్పక చదవండి

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. మనదేశంలో ఉన్న కులాలు, రాజకీయ పార్టీలు మరి ఏఇతర దేశాలలో లేవు. ప్రతి రాజకీయ పార్టీకి
ముఖ్య కార్యవర్గంతో పాటుగా అనుబంధ సంఘాలలో కుల సంఘాలు కూడా ప్రముఖమైన పాత్ర ఉంటుంది. ముఖ్య కమిటీల్లో అన్ని కులాలకు అన్ని వర్గాల
కార్యకర్తలకు ప్రాతినిథ్యం ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీలలో కుల ఆదిపత్యం రాజ్యమేలుతుంది. కొన్ని పార్టీలలోనీ కార్యకర్తలు జెండాలు మోసి, జేజేలు కొట్టి, బ్యానర్లు కట్టి, బహిరంగ సభలను విజయవంతం చేసి, సీనియర్ కార్యకర్తలుగా పేరుకు మాత్రమే ఉంటున్నారు. ఎలాంటి పదవులు, ప్రజా ప్రతినిధులుగా అవకాశాలు దక్కడం లేదు. నామినేటెడ్ పదవులు నామమాత్రానికి కూడా లేవు. నిరక్షరాశులకు ఇచ్చిన గౌరవం సైతం అక్షరాసులకు ఇవ్వడం లేదు.. అమాయకులు, చెప్పుచేతలలో ఉండేవారికి తిరిగి సమాధానం చెప్పలేని వారికి అవకాశాలు దక్కుతున్నాయి. కొన్ని వర్గాల కార్యకర్తలు అతి తక్కువ సమయంలో
అతి చిన్న వయసులో కూడా పార్టీలలో పదవులు అనుభవించి లబ్ది పొందుతున్నారు. మరి కొంతమంది కొన్ని కులాలకు చెందిన కార్యకర్తలు జీవితాంతం సామాన్య కార్యకర్తగా పార్టీలలో కొనసాగడం జరుగుతుంది. పార్టీలు మారే వారికే పార్టీలలో పలుకుబడి గౌరవం ఇస్తున్నారు. పార్టీని పట్టుకొని కష్టకాలంలో కాపాడిన వారికి కనీస గౌరవం దక్కడం లేదు. రాజకీయ పార్టీల సభలు సమావేశాలలో కొన్ని వర్గాల కులాల కార్యకర్తలను కనీసం గౌరవించి సంబోధించడం లేదు. పార్టీ సమావేశాలకు కొన్ని వర్గాలకు చెందిన కార్యకర్తల యొక్క కాలనీల నుండి వాహనాలలో జన సమీకరణ చేయడం జరుగుతుంది. కొంతమంది కార్యకర్తలు కేవలం నాయకత్వం మాత్రమే వహిస్తారు. ఫోటోలకు ఫోజులిచ్చి, వాట్సాప్ ఫేస్బుక్ లలో కనిపించే కార్యకర్తలు కొందరు. కార్యకర్తలకు కష్టకాలంలో నిత్యం అందుబాటులో ఉండే
కార్యకర్త నిజమైన కార్యకర్త, ఎలక్షన్ల కోసమే దిగుమతి అయ్యే ప్రత్యక్షమయ్యే కార్యకర్తలు కొందరు. ఎలక్షన్ల కోసం ఎన్నో జిమ్మిక్కులు చేసే రాజకీయ కురువృద్ధులు అనుభవజ్ఞులైన కార్యకర్తలు కొందరు ఉన్నారు. సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్న కుల వివక్షత, కుల ఆధిపత్యం రాజకీయ పార్టీలలో కూడా రాజ్యమేలుతుంది.

  • ఈదునూరి మహేష్
    ఎంఏ.ఎంసిజె(జర్నలిజం)
    సీనియర్ జర్నలిస్ట్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు