Tuesday, June 18, 2024

సోమవారం యమ డేంజర్..

తప్పక చదవండి
  • ఆరోజే గుండెపోట్లు ఎక్కువగా వస్తాయి..
  • ఐదేళ్లలో పదివేలకు పైగా బాధితులపై పరిశోధన..
  • సంచలన విషయాలు వెల్లడించిన ఐర్లాండ్
    బెల్ ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్..

మాంచెస్టర్, 06 జూన్ :
గుండెపోటు.. ఎప్పుడు, ఎవరికి వస్తుందో డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్నామని అనుకునే వాళ్లు కూడా హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఎన్నో! అయితే, గుండె పోటుకు గురయ్యే.. అదీ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యే ముప్పు సోమవారమే ఎక్కువని ఐర్లాండ్​ వైద్యులు పేర్కొన్నారు. ఐదేళ్లలో పదివేలకు పైగా గుండెపోటు బాధితుల కేసులను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించామని చెప్పారు. ఐర్లాండ్​లోని బెల్​ఫాస్ట్​ హెల్త్​ అండ్​ సోషల్​ కేర్ ట్రస్టుతో కలిసి రాయల్​ కాలేజ్​ ఆఫ్ సర్జన్స్ ఈ స్టడీ నిర్వహించారు. ఇందులో భాగంగా 10,528 మంది గుండెపోటు బాధితుల హెల్త్​ డాటాను విశ్లేషించారు. 2013 నుంచి 2018 వరకు తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన రోగుల వివరాలను పరిశీలించారు. ఇలాంటి కేసులు సోమవారమే ఎక్కువగా నమోదయ్యాయని పరిశోధకులు తెలిపారు. వారంలో తొలి రోజుకు, ఈ గుండెపోటు కేసుల పెరుగుదలకు సంబంధం ఉందని గుర్తించామన్నారు. దీనికి కారణం జీవ గడియారంలో మార్పులేనని బ్రిటీష్​ హార్ట్​ ఫౌండేషన్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలేశ్​ సామాని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు