- క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడి..
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు రాజకీయ అరంగేట్రంపై ఆచీతూచి స్పందిస్తున్నాడు. క్రికెట్ ను మానుకున్న తరువాత రాజకీయాల్లో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగడంతో ఆయన ఏ పార్టీలో చేరుతారని ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఆదివారం ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ను అంబటి రాయుడు సందర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై స్పందించారు. తాను ఇంకా ఏ పార్టీలో చేరలేదని స్పష్టం చేస్తూనే ఎక్కడి నుంచి పోటీ లేదంటూ వెల్లడించారు. అక్షయ పాత్ర ద్వారా పిల్లలకు ఆహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఐపీఎల్ జట్టు కోసం కృషి చేస్తానని వెల్లడించారు.
అకాడమీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన కొన్ని నెలల క్రితం ఐపీఎల్‌కూ బైబై చెప్పాడు. అయితే తన మనుసులోని మాటను వెల్లడించకుండానే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అక్కడి సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.