Sunday, May 12, 2024

భారత్ సినిమాలపై ఖాట్మాండ్‌లో నిషేధం..

తప్పక చదవండి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిత్రంలో డైలాగ్స్‌తో పాటు ప్రజెంటేషన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రంపై నేపాల్ లోనూ వివాదం తలెత్తింది. సీత.. నేపాల్ లో పుడితే, సినిమాలో మాత్రం భారత్ లో పుట్టినట్లు చూపించారంటూ అక్కడి అధికారులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌ మేయర్ బలెన్ షా స్పందించారు

‘ఆదిపురుష్’తో పాటు ఇండియన్ సినిమాలన్నింటినీ సోమవారం నుంచి ఖాట్మాండ్‌లో నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. సీత జన్మించిన ప్రాంతానికి సంబంధించిన అభ్యంతరకర సందేశాన్ని తొలగించాలని చిత్ర యూనిట్ ని మూడు రోజుల క్రితం కోరినట్లు తెలిపారు. సంబంధిత సన్నివేశాన్ని మార్చకపోతే కాఠ్ మాండూ మెట్రోపాలిటిన్ సిటీలో ఏ హిందీ చిత్రం ప్రదర్శితమయ్యే అవకాశం ఉండదని తెలిపారు. అయినప్పటికీ చిత్ర యూనిట్ అభ్యంతకరకర పదాలను ఇంకా తొలగించనందున జూన్ 19 (సోమవారం ) నుంచి ఖాట్మాండ్‌ మెట్రోపాలిటన్ పరిధిలోని థియేటర్లలో ‘ఆదిపురుష్’ సహా అన్ని హిందీ చిత్రాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ నిషేధం ఖాట్మాండ్‌ ప్రాంతానికే పరిమితమవుతుందని తెలిపారు.

- Advertisement -

మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతీసనన్ సీతగా కనిపించింది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించాడు. ఓంరౌత్ దర్శకుడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు