Saturday, July 27, 2024

టీటీడీపీలో బీసీలకు పెద్దపీట

తప్పక చదవండి
  • జనాభా దమాషా పద్దతే ప్రామాణికం..
  • తొలి టికెట్‌ నాయి బ్రాహ్మణులకు ప్రకటించే అవకాశం..
  • రెండవది రజకులకు.. మూడవది ఎస్సీ, ఎస్టీ లకు..
  • నాలుగవ టికెట్‌ మైనార్టీలకు ప్రకటించనున్న కాసాని..
  • బీసీలకు 60 సీట్లు కేటాయించనున్నట్లు సమాచారం..
  • నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు..
  • గతంలో మాదిరి మహిళలకు ప్రాధాన్యతనిచ్చే ఛాన్స్‌..
  • బీజేపీతో పొత్తుపై సస్పెన్స్‌.. ఒంటరి పోరుకు సిద్ధం..
    రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌ ను సృష్టించిన తెలుగుదేశం పార్టీ.. తన వ్యూహాలతో ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు చెక్‌ పెడుతూ ఉంటుంది.. స్వర్గీయ ఎన్టీఆర్‌ నేతృత్వంలో పురుడుపోసుకున్న తెలుగుదేశం, ఆయన తదనంతరం చంద్రబాబు సాంకేతికత మేధస్సుతో ముందుకు సాగింది. ఇప్పుడున్న అన్ని పార్టీల కొందరు నాయకులు తెలుగుదేశం నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్న వారే.. కారణాంతాలవల్ల తెలంగాణాలో తుడిచిపెట్టుకు పోయింది అనుకున్న తెలుగుదేశం పార్టీ.. తాజాగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ నేతృత్వంలో చంద్రబాబు మేధస్సుతో దూసుకుపోతోంది.. చంద్రబాబు వ్యూహాలను తుచ తప్పకుండా అమలు చేస్తున్న కాసాని, తనదైన ఫందా లో రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికపై దృష్టిని పెట్టారు.. అన్ని వర్గాలను సమతూకంలో ఉంచుతూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు..
    హైదరాబాద్‌ : అభ్యర్థుల ఎంపిక పై టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ కసరత్తు ముమ్మరం చేశారు. .ఇప్పటికే 18 అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిన ఆయన తాను సిద్ధం చేసిన జాబితాను ఆగష్టు చివరి మాసంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్‌ మాసంలో రెండవ, మూడవ జాబితాను ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ముందుగా కాసాని జ్ఞానేశ్వర్‌ నాయి బ్రాహ్మణులకు మాటిచ్చిన ప్రకారం వారి సంఘం గుర్తించిన అభ్యర్థికే తోలి టికెట్‌ ను ప్రకటించే అవకాశం ఉంది. రెండవ టికెట్‌ రజకులకు.. మూడవ టికెట్‌ ఎస్సి లకు, ఎస్టీ లకు వారి సంఘం ప్రకటించిన అభ్యర్థులకు కాసాని అభ్యర్థులుగా ప్రకటించనున్నారని.. ఇక నాలుగవ టికెట్‌ మాత్రం మైనార్టీలకు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చర్చింకుంటున్నాయి.. దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలను, మహిళలను అన్ని ప్రధాన పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని పదేపదే ఆరోపిస్తున్న కాసాని ఈ సారి జరుగనున్నఅసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లను కేవలం ఒక్క బీసీలకే ప్రకటిస్తారన్న ప్రచారం తెలంగాణలో జోరందుకుంది. వీరిలో ఎక్కువశాతం సీట్లను చదువుకున్నయువతీ,యువకులకు ఇవ్వడమే గాక సమాజంలో మంచి పేరున్న నాయకులను నియోజకవర్గాల వారీగా గుర్తించి వారికే అవకాశం కల్పించి రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని కాసాని భావిస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
    బీసీలకు 60 సీట్లు కేటాయించనున్న టీటీడీపీ :
    అన్ని రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌.. ఈసారి వారికి 60 సీట్లు కేటాయించి టీడీపీ నిబద్ధతను చాటే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో, రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న బీసీలు అవకాశాలు లేక.. రాక అన్నిరంగాల్లో వెనుకబాటు తనాన్ని అనుభవిస్తున్నారని పలు సందర్భాల్లో ఆవేదన ఆ వ్యక్తం చేసిన కాసాని స్వాభిమానమే ఎజెండాగా బీసీలు ఐకమత్యంగా కలిసి ఉండి, బీసీ సామజిక వర్గానికి నాయకులుగా ఎదిగే అవకాశం కల్పించాలనే పదే పదే కోరారు. ఈ మేరకు ఆయన తనవంతు భాద్యతగా 119 స్థానాల్లో 60 సీట్లను కేవలం బీసీలకు కేటాయించే .. విప్లవాత్మకమైన నిర్ణయం త్వరలో ప్రకటించనున్నట్లు టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
    నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఖరారు : నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని నాయకులు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఇటీవల జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న యువనాయకుడు కాసాని వీరేష్‌ తో పాటు మరికొంత మంది సీనియర్‌ నాయకులకు అప్పగించినట్లు సమాచారం.. వీరు నియోజకవర్గాల వారీగా పోటీచేసే అభ్యర్థులను గుర్తించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కు ఒక నివేదిక రూపంలో అభ్యర్థుల సమాచారం అందించనున్నారని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు.
    గతంలో మాదిరి మహిళలకు ప్రాధాన్యతనిచ్చే ఛాన్స్‌ : నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా చదువుకున్న విజ్ఞావంతులయిన మంచి పేరున్న యువతీ, యువకులను గుర్తించి వారిని టీటీడీపీ అభ్యర్థులుగా కాసాని ప్రకటించే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డబ్బు ఈ ఎన్నికల్లో కీలకం కాదని పదేపదే ప్రస్తావిస్తున్న కాసాని ప్రజలకు చేయగలిగే మంచిని మాత్రమే చెప్పి ఓట్లు అడగాలని నాయకులకు పదే పదే సూచిస్తు న్నారు. నికార్సైన నాయకులను ప్రజలు తప్పక ఆదరిస్తారని, ప్రజల కు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలని, వారికి మంచి చేయగలమనే నమ్మకం కలిగిస్తే విజయం వరిస్తుందని కాసాని చెబుతుంటారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటూ ఉంటారు. గతంలో టీడీపీ కొనసాగించిన విధానం మహిళలకు, యువతకు పెద్దపీట వేయాలనేదే లక్ష్యంగా కనిపిస్తోంది.. ఈ సంకల్పంతో కాసాని ముందుకు సాగుతున్నారని.. కాసాని నిర్ణయంతో రాజకీల్లో ఎన్నో మార్పులు వస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు.
    ఏది ఏమైనా ఒక ప్రణాళికతో ముందుకు సాగుతున్న కాసాని జ్ఞానే శ్వర్‌ ముదిరాజ్‌ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టి ంచే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు