Sunday, May 19, 2024

వచ్చే ఎన్నికల్లో మోడీ అవుట్‌ రాహుల్‌ ఇన్‌

తప్పక చదవండి
  • ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎన్నడు చూడలే శ్రీ తెలంగాణ పైసల్‌ పంజాబ్‌, బీహార్‌లో పంచుతుండు
  • పొన్నంకు సముచిత స్థానం కల్పిస్తాం మాజీ రాజ్య సభ సభ్యులు హన్మంతరావు
    కరీంనగర్‌ బ్యూరో : వచ్ఛే ఎన్నికల్లో మోడీ అవుట్‌ రాహుల్‌ ఇన్‌ అని మాజీ రాజ్య సభ సభ్యులు వి.హన్మంతరావుజోష్యం చెపుతూ రాష్టంలో ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎన్నడు చూడాలే దనితెలంగాణ పైసల్‌ పంజాబ్‌ బీహార్‌ లోకేసీ ఆర్‌ పంచుతుండని విమర్శించారు.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ బీసీ ఐక్య వేదిక జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం( ఇందిరా గార్డెన్‌) లో మంగళవారం జరిగింది. ఐక్యవేదిక సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు,మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, శాసనమండలి సభ్యులు జీవన్‌ రెడ్డి,ముఖ్య అతి థులుగా హాజరైయ్యారు. వి. హనుమంతరావు మాట్లాడుతూ… చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగిందని, ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎన్నడు చూడలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీల గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని అన్నారు. సోనియా గాంధీకి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించారు తప్ప పదవుల గురించి ఆలోచిం చలేదని అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్‌ పార్టీలోనే న్యాయం జరిగిందని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున కార్గేని ఏఐసీసీ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని, ఇలా బడుగు బలహీన వర్గాల వారిని ఎస్సీ ఎస్టీలను అధ్యక్షులుగా నిర్మించే దమ్ము ఇతర పార్టీలకు ఉందా, నేను రెడ్డిసామాజిక వర్గానికి చెందిన వాడినైతే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడిని, బీసీ డిక్లరేషన్‌ చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని దేశంలో ఏ పార్టీ అయినా బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీల ఓట్ల ద్వారానే గెలుస్తున్నాయని కానీ బీసీలను ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. కెసిఆర్‌ తెలంగాణ పైసలు బీహార్‌ పంజాబ్‌ రాష్ట్రాల్లో పంచుతున్నారని ఇక్కడి రైతులు కేసీఆర్‌ కన్లకు కనపడడం లేదా బీసీ నాయకుడైన మాజీ పార్లమెంట్‌ సభ్యులు పొన్నం ప్రభాకర్‌ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, నరేంద్ర మోడీ అవుట్‌ రాహుల్‌ గాంధీ ఇన్‌, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో బీసీలకు మూడు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయమని అన్నారు. జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ 60 శాతం ఉన్న బలహీన వర్గాల వారికి సముచిత స్థానం కల్పించాలని ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో రెండు సీట్లు బలహీన వర్గాలకు కేటాయిం చాలని పీఏసీ కమిటీలో నిర్ణయించా మని అన్నారు.బలహీన వర్గాల వారికి సహాయం చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కెసిఆర్‌ బిఆర్‌ఎస్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు,ఎన్నికలు సమీపిస్తున్న వేల బీసీలకు లక్ష రూపాయల రుణం ఇస్తామని బీసీలను మభ్యపెడుతున్న కేసీఆర్‌, కెసిఆర్‌ క్యాబినెట్లో 18 మంది మంత్రులు ఒక స్పీకర్‌, శాసనమండలి స్పీకర్‌ తో కలిపి మొత్తం 20 మంది ఉంటే అందులో ముగ్గురే బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నది చేసింది వి.హనుమంతరావు కొనియాడారు. దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్‌ పార్టీలోనే అని, పొన్నం ప్రభాకర్‌ ఎన్‌ఎస్‌యుఐ, మార్క్ఫెడ్‌ పార్లమెంటు సభ్యులుగా అవకాశం ఇచ్చిందని,ఆయనకు మళ్లీ అవకాశం కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలహీన వర్గాలకు చెందిన వారిని పిసిసి అధ్యక్షులుగా ఎంతో మందికి అవకాశం కల్పిం చిందని ఇది వేరే పార్టీల వల్ల అవుతుందా అని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సంజయ్‌ను తీసి కిషన్‌ రెడ్డికి కట్టబెట్టింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్‌,ఆడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మక్కాన్‌ సింగ్‌, ఈర్ల కొమురయ్య వైద్యుల అంజన్‌ కుమార్‌, నాయకులు కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, సంగీతం శ్రీనివాస్‌, నాగుల సత్యనారాయణ గౌడ్‌, ఘంటా రాములు, సిరాజు హుస్సేన్‌, చర్ల పద్మ, ఎండి తాజ్‌, శ్రావణ్‌ నాయక్‌, మడుపు మోహన్‌, నాగం కుమార్‌,సాగరం వెంకటస్వామి, ఉరుమెట్ల రాజ లింగం, కుర్ర పోచయ్య, గుండాటి శ్రీనివాస్‌ రెడ్డి, కంకణాల అనిల్‌ కుమార్‌ గుప్తా, సిరిపురం నాగప్రసాద్‌, ఇమ్రాన్‌,ఇన్నారెడ్డి, హైమద్‌ ధర్నా సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు