Friday, September 13, 2024
spot_img

పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్‌…

తప్పక చదవండి

భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్, గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్‍ను విడుదల చేసింది.. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌), అసిస్టెంట్‌బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. పదో తరగతి సబ్జెక్టుల్లో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష తప్పనిసరిగా చదివి ఉండాలి. అంటే.. ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదివి ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి. సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయసు జూన్‌ 11, 2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 11, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, ట్రాన్స్‌ జండర్‌, మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలక్ట్‌ అయిన వారికి నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000ల నుంచి రూ.29,380ల వరకు, ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000ల నుంచి రూ.24,470ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు