Saturday, July 27, 2024

బరితెగిస్తున్న బడా బిల్డర్లు..

తప్పక చదవండి
  • శేరిలింగంపల్లి సర్కిల్లో ఇబ్బడి ముబ్బడిగా సెల్లార్ల నిర్మాణం..
  • సెల్లార్ల కారణంగా ప్రమాదకరంగా మారిన అపార్ట్మెంట్స్..

చట్టాలను భేఖాతర్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా.. ఆస్తవ్యస్తంగా సెల్లార్లను తవ్వుతున్నారు కొందరు బడా బిల్డర్లు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల, డాక్టర్ కాలనీలో ఓ ప్రైవేటు సంస్థ వారు పరిమితికి మించి సెల్లార్లను త్రవ్వుతున్నారు.. సెల్లార్లకు చుట్టూరా అపార్ట్మెంట్ లు ఉండడంతో సెల్లార్ కారణంగా ప్రహరీ గోడలు కూలిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. జిహెచ్ఎంసి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చుట్టుపక్కల ఉన్న ప్రహరీ గోడలు కూలిపోయి కింద వేసిన ఫ్లోరింగ్ కొంత భాగము క్రాక్స్ వచ్చాయి.. దీనికి అధికారులు స్పందించకపోవటమే కారణమని సీనియర్ సిటిజన్స్ వాపోతున్నారు. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారుల సమన్వయ లోపం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సెల్లార్లను తవ్వకూడదని జీఓ ఉన్నప్పటికీ బిల్డర్లు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు సెల్లార్లను తవ్వుతుండడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత జేఎన్టీయూ ఇంజనీరింగ్ సిబ్బందిని పిలిచే కంటే ముందుగానే, పర్యవేక్షించి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం అంచుల్లో ఉన్న సెల్లార్లను తనిఖీ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను యాజమాన్యానికి తెలియజేసే కార్యక్రమంలో శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి ఉప కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఏసిపి మెహర, టిపిఎస్ రమేష్, చైన్మేన్ లక్ష్మీనారాయణ, జావిద్, కృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు