- ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైనం..
- ప్లీజ్ కాపాడమంటూ ఆవేదన..
కొండాయి వద్ద జంపన్న వాగు పొంగడంతో ఆరుగురు గల్లంతు అయ్యారని ములుగు ఎమ్మెల్యే సీతక్క కన్నీరు పెట్టుకున్నారు.. వరద ఉధృతికి రెస్క్యూ టీం సహాయం చేయలేకపోతోంది.. కొండాయి, ఎలిశెట్టిపల్లి సహా మరికొన్ని గ్రామాల్లో 100 మంది ప్రమాదకర పరిష్టితుల్లో ఉన్నారు.. ఆరుగురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.. ఊళ్ళ చుట్టూ వాగులూ, చెరువులే ఉన్నాయి.. హెలికాఫ్టర్ ద్వారా ప్రజలను తరలించాలంటూ ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది..