Friday, September 20, 2024
spot_img

మార్కెట్లోకి దేశంలోనే తొలి మినీ ఎస్‌యూవీ హ్యుండాయ్‌ ఎక్స్‌టర్‌

తప్పక చదవండి

దక్షిణ కొరియా ఆటో మేజర్‌ హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా సోమవారం.. భారత్‌ మార్కెట్లో తన మినీ సైజ్‌ ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ ఆవిష్కరించింది. దీని ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. సబ్‌-4 మీటర్‌ మినీ ఎస్‌యూవీ సెగ్మెం ట్‌లో అతి చౌక ధరకు లభించే కారు ఎక్స్‌టర్‌ అని తెలిపింది. అన్ని వేరియంట్లలోనూ 6-ఎయిర్‌ బ్యాగ్స్‌తో వస్తుంది. టాటా మోటార్స్‌ పంచ్‌ మోడల్‌ కారుతో ఎక్స్‌టర్‌ పోటీ పడుతుంది. టాప్‌ వేరియంట్‌ ఎక్స్‌టర్‌ లో 40 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇతర వేరియంట్లలో 26కిపైగా సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి తెస్తున్న ది హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా. 60ం బ్లూ లింక్‌ కనెక్టెడ్‌ ఫీచర్స్‌ విత్‌ డ్యుయల్‌ డాష్‌ కామ్స్‌ అండ్‌ హోం టు కార్‌ అలెక్సా సపోర్టింగ్‌ హింగ్లిష్‌ వాయిస్‌ కమాండ్స్‌తో పని చేస్తుందీ కారు. అయితే, ఈకారు ఎంతమైలేజీ ఇస్తుందన్నసంగతి వెల్లడిరచలేదు. ఎక్స్‌టర్‌ వేరియంట్ల వారీ ధరలు ఇలా.. ఈఎక్స్‌, రూ.5,99, 900 ఎస్‌, రూ.7,26,990 ఎస్‌ఎక్స్‌, రూ. 7,99,990 ఎస్‌ఎక్స్‌ (ఓ), రూ.8,63,990 ఎస్‌ఎక్స్‌ (ఓ) కనెక్ట్‌, రూ.9,31,990 స్మార్ట్‌ ఆటో – రూ.7,96,980సీఎన్జీ వేరియంట్‌ రూ. 8,23,990 మే 8 నుంచే బుకింగ్స్‌ ప్రారంభం.. గత మే 8 నుంచే హ్యుం డాయ్‌ ఎక్స్‌టర్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభం అ య్యాయి. రూ.11 వేలు చెల్లించి కారు బుక్‌ చేసుకోవచ్చు. మూడే ండ్ల వరకు వారంటీ ఆఫర్‌ చేస్తున్నారు. టాటా మోటార్స్‌ పంచ్‌, సిట్రోన్‌ సీ3, రెనాల్ట్‌ కైగర్‌, నిసాన్‌ మాగ్నైట్‌, మారుతి సుజుకి ఫ్రాంక్స్‌,మారుతిసుజుకి ఇగ్నీస్‌ మోడల్‌ కార్లతో పోటీ పడుతుంది. 40ం అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఇలా.. హ్యుండాయ్‌ ఎక్స్‌టర్‌ టాప్‌ వేరియంట్‌ కారులో 40ం అడ్వాన్స్‌ డ్‌ సేఫ్టీ ఫీచర్లు, మిగతా వేరియంట్లలో 26కి పైగా సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. టీపీఎంఎస్‌ (హైలైన్‌), బర్గ్‌లర్‌ అలారం సహా పలు ఫస్ట్‌ సేఫ్టీ ఫీచర్లు జత చేశారు. హెడ్‌ ల్యాంప్‌ ఎస్కార్ట్‌ ఫంక్షన్‌, ఆటో హెడ్‌ ల్యాంప్స్‌, చైల్డ్‌ ఐఎస్‌ఓఎఫ్‌ఐఎక్స్‌ సీట్‌, రేర్‌ డీఫాగర్‌, రేర్‌ పార్కింగ్‌ కెమెరా తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. సెగ్మెంట్‌ ఫస్ట్‌ మొబైల్‌ కనెక్టింగ్‌ డ్యుయల్‌ డాష్‌ కామ్‌.. హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా నుంచి దేశీయ మార్కెట్లోకి వస్తున్న తొలి మినీ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ కారు ఇది. స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ సన్‌ రూఫ్‌ విత్‌ వాయిస్‌ కమాండ్స్‌, డాష్‌ కామ్‌ విత్‌ డ్యుయల్‌ (ఫ్రంట్‌ అండ్‌ రేర్‌) కెమెరాలు ఉంటాయి. డ్రైవింగ్‌ (నార్మల్‌), ఈవెంట్‌ (సేఫ్టీ), వెకేషన్‌ (టైమ్‌ ల్యాప్స్‌) మోడ్స్‌లో మల్టీఫుల్‌ రికార్డింగ్‌ కోసం డాష్‌ కామ్‌ విభిన్న రికార్డింగ్‌ మోడ్స్‌ ఆఫర్‌ చేస్తున్నది. ఫుల్‌ హెచ్డీ వీడియో రిజొల్యూషన్‌కు డాష్‌ కామ్‌ సపోర్ట్‌గా ఉంటుంది. ఫ్రంట్‌ అండ్‌ రేర్‌ కెమెరాలతో ప్రయాణికులు ఫొటోలు తీసుకోవచ్చు. హిందీ-ఇంగ్లిష్‌ వాయిస్‌ కమాండ్స్‌.. హోమ్‌ టు కార్‌ (హెచ్‌2సీ) అలెక్సా విత్‌ హిందీ అండ్‌ ఇంగ్లిష్‌ వాయిస్‌ కమాండ్స్‌ గల తొలి కారు ఇది. సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ, రిమోట్‌ సర్వీసెస్‌, లొకేషన్‌ బేస్డ్‌ సర్వీస్‌, వెహికల్‌ డయాగ్నిస్టిక్స్‌, వాయిస్‌ అసిస్టెన్స్‌, ఇంటర్నెట్‌ లేకున్నా ఎంబీడెడ్‌ వాయిస్‌ కమాండ్స్‌ వర్క్‌ ఉంటుంది. హింగ్లిష్‌లో వాయిస్‌ కమాండ్స్‌ ఉంటాయి. ఇంటీరియర్‌ డిజైన్‌.. కంఫర్ట్‌ ఫీచర్లు ఇలా.. గ్రాండ్‌ ఐ10 నియోస్‌, ఔరా మోడల్‌ కార్లలో మాదిరే ఎక్స్‌టర్‌ డాష్‌ బోర్డు ఉంటుంది. 8.0-అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ ప్లే, హ్యుండాయ్‌ బ్లూ లింక్‌ కనెక్టెడ్‌ కార్‌ టెక్‌ సహా 60ం ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్‌ క్లస్టర్‌లో డ్రైవ్‌ స్టాటిస్టిక్స్‌, పార్కింగ్‌ డిస్టెన్స్‌, డోర్స్‌ ఓపెన్‌, సన్‌ రూఫ్‌ ఓపెన్‌ తోపాటు అన్ని సీట్లకూ.. సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ డిస్‌ ప్లే ఉంటాయి. హెచ్‌-షేప్డ్‌ ఎల్‌ఈడీ డే టైం రన్నింగ్‌ లైట్స్‌ (డీఆర్‌ఎల్స్‌) కనెక్టెడ్‌ బై థిన్‌ బ్లాక్‌ స్ట్రిప్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్స్‌ ఉంటాయి. డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌, ఫ్లోటింగ్‌ రూఫ్‌ డిజైన్‌, బ్రిడ్జి టైప్‌ రూఫ్‌ రెయిల్స్‌, సైడ్‌ బాడీ క్లాడిరగ్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. ఎక్స్‌ టర్‌ కారు 6 సింగిల్‌, త్రీ డ్యుయల్‌ టోన్‌ కలర్స్‌ లో లభిస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు