Friday, September 13, 2024
spot_img

ధోనీ రనౌట్‌ కొంప ముంచింది

తప్పక చదవండి

2019 వరల్డ్‌ కప్‌ ఓటమితో ధోనీ రిటైర్మెంట్‌

ముంబై : భారత జట్టు 2019 వరల్డ్‌ కప్‌లో టైటిల్‌ ఫేరెట్‌గా బరిలోకి దిగింది. అంచనా లకు తగ్గట్టు రాణించి సెవిూస్‌ చేరింది. అయితే న్యూజిలాండ్‌పై ఓటమి బాధతో ఆ మరుసటి ఏడాదే మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలిచి ఉంటే ధోనీ మరికొన్నాళ్లు ఆడేవాడని అతని సన్నిహితులు చెప్తుంటారు. సెవిూ ఫైనల్లో మొదట ఆడిన న్యూజిలాండ్‌ 8 వికెట్ల నష్టానికి 239 రన్స్‌ కొట్టింది. 240 లక్ష్య ఛేదనలో టీమిండియా టాపార్డర్‌ విఫలం అయింది. దాంతో ఎంఎస్‌ ధోనీ(50), రవీంద్ర జడేజా(77) జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. హాఫ్‌ సెంచరీ బాదిన మహీని మార్టిన్‌ గుప్తిల్‌ మెరుపు త్రోతో రనౌట్‌ చేశాడు. రెండో పరుగుకు ప్రయత్నించిన ధోనీ కొంచెం అయితే క్రీజులోకి వెళ్లేవాడు. కానీ, ఆ కాసేపటకే జడ్డూ ఔట్‌ కావడంతో భారత జట్టు 221కే ఆలౌటయ్యింది. దాంతో, కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని కివీస్‌ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్‌ జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడిరది. బెన్‌ స్టోక్స్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడడంతో ఇంగ్లండ్‌ ఆఖరి ఓవర్‌ చివరి బంతికి స్కోర్‌ సమం చేసింది. దాంతో, సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. సూపర్‌ ఓవర్లో ఇయాన్‌ మోర్గాన్‌ సేన గెలుపొం దింది. దాంతో, క్రికెట్‌ పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌ తొలిసారి విశ్వ విజేతగా అవతరించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు