Sunday, October 13, 2024
spot_img

కొట్టుకుపోయిన కారు..

తప్పక చదవండి

స్పెయిన్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలకు రోడ్లన్నీ నదులుగా మారాయి. దీంతో వరద తాకిడికి కార్లు, పలువురు పాదచారులు కొట్టుకుపోయారు. స్పెయిన్‌లోని మధ్యదరా తీర పట్టణమైన మొలినా డి సెగురాలో కురిసిన వానకు ఓ కారు కొట్టుకుపోతున్న దృష్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. పట్టణంలోని ఓ వీధిలో వరద ప్రవహిస్తున్నది. అయితే దానిని దాటడానికి ప్రయత్నించిన ఓ కారు డ్రైవర్‌.. నీటి ప్రవాహం ధాటికి డ్రైవర్‌ కారుపై పట్టు కోల్పోయాడు. దీంతో ఎరుపు రంగులో ఉన్న కారు వెనుకకు కొట్టుకుపోవడంతో వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. అలా 50 మీటర్ల దూరం కొట్టుకుపోయిన కారు.. చివరికి ఆగిపోయింది. అయితే అందులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.రాజధాని మాడ్రిడ్‌తోపాటు దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వానలు కురుస్తున్నాయి. దీంతో వారంరోజులుగా స్కూళ్లు, యూనివర్సిటీలు, డే కేర్‌ సెంటర్లను అధికారులు మూసివేశారు. వర్షాల ధాటికి స్పెయిన్‌ ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోయిందని అధికారులు చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు