Thursday, October 10, 2024
spot_img

చక్కర వ్యాధికి ఓరల్‌ ఇన్సులిన్‌..

తప్పక చదవండి

మధుమేహ వ్యాధిగ్రస్థుల కోసం ప్రపంచంలోనే మొదటిసారిగా నోటి ద్వారా తీసుకునే ఓరల్‌ ఇన్సులిన్‌ చైనాలో అందుబాటులోకి రానున్నది. ఓఆర్‌ఏ-డీ-013-1 అనే ఈ ఇన్సులిన్‌ను ఇజ్రాయిల్‌కు చెందిన ఒరామెడ్‌ ఫార్మాస్యూటికల్స్‌ అనే సంస్థ అభివృద్ధి చేసింది. చైనాలోని హెఫెయ్‌ టియాన్‌హుయ్‌ బయోటెక్నాలజీ (హెచ్‌టీఐటీ) ఈ ఓరల్‌ ఇన్సులిన్‌ ఫేస్‌-3 ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసింది. రెండు మూడు నెలల షుగర్‌ లెవల్స్‌ను సూచించే ఏ1సీ లెవల్స్‌ను తగ్గించడంలో ఈ ఇన్సులిన్‌ సమర్థంగా పని చేస్తున్నట్టు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. దీంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆ దేశ నేషనల్‌ మెడికల్‌ ప్రాడక్ట్స్‌ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నది. ఈ సంస్థ నుంచి అనుమతి లభించగానే చైనాలో ఓరల్‌ ఇన్సులిన్‌ అందుబాటులోకి రానున్నది. మధుమేహం తీవ్రంగా ఉన్న వారిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి సరిగ్గా జరగదు. దీంతో శరీరానికి అవసరమయ్యే ఇన్సులిన్‌ను కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇంజెక్షన్‌ల ద్వారా ఇన్సులిన్‌ను తీసుకోవాల్సి వచ్చేది. ప్రతిరోజూ ఇంజెక్షన్‌ వేసుకోవడం మధుమేహ బాధితులకు కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఓరల్‌ ఇన్సులిన్‌ ద్వారా ఈ సమస్య ఉండదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు