- ఆందోళనకు గురిచేస్తున్న ఎడతెరపి లేని వానలు..
- వరదల ధాటికి కొట్టుకుపోతున్న వంతెనలు, రోడ్లు, ఇండ్లు..
- నీటిపై తేలియాడుతున్న వాహనాలు..
- ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో స్కూళ్ళు, ఆఫీసులు బంద్..
- సహాయక చర్యల్లో మునిగిపోయిన అధికారులు..
భారీ వర్షాలతో ఉత్తర భారతం అల్లాడిపోతోంది. ఢిల్లీ, పంజాబ్‌తో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలతో నదులన్నీ పోటెత్తి వరద బీభత్సం సృష్టించింది. వరదల ధాటికి వంతెనలు, రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడి ఇండ్లు, రోడ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల కార్లు నీటిపై తేలుతూ కొట్టుకుపోయాయి. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో స్కూళ్లు ఆఫీసులు మూసివేశారు. గడిచిన 24 గంటల రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఉనాలో అత్యధికంగా 228 మి.మీల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రోడ్లు, ఇండ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.