Saturday, May 4, 2024

గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు..

తప్పక చదవండి
  • విద్యార్థులు నిరంతరం శ్రామించాలి
  • సూచించిన కల్లు గీత పారిశ్రామిక ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్

హనుమకొండ, గౌడ విద్యార్థుల లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలని తెలంగాణ కల్లు గీత పారిశ్రామిక, ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. హనుమకొండ జిల్లా గోపా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హంటర్ రోడ్ లోని గౌడ హాస్టల్ భవనంలో గోపా అధ్యక్షుడు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ అధ్యక్షతన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పదవ తరగతి, ఇంటర్మీడియట్ ప్రతిభ కనబరిచిన 60 మంది గౌడ విద్యార్థులకు నగదు పారితోషకం, మెమంటోతో పాటు శాలువాతో ఘనంగా సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టాడీ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థితిలోకి వస్తారని సృష్టించేశారు. తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. గోపా రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల రమేష్ బాబు గౌడ్ మాట్లాడుతూ.. గౌడ విద్యార్థులు ఐఏఎస్ బుర్ర వెంకటేష్ గౌడును ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి ఐఏఎస్ కావాలని సూచించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించినట్లయితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ బండి సాయన్న గౌడ్, భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, మాజీ గోపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బోల్గం విజయభాస్కర్ గౌడ్, వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, నేరెళ్ల దామోదర్ గౌడ్, ఏసీపి నాగయ్య గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ గౌడ్, హనుమకొండ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంవి రమణ, బోనగాని యాదగిరి గౌడ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, శ్రీపతి గోపి గౌడ్, వరంగల్ గోపా అధ్యక్షుడు డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ గౌడ్, గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేష్ గౌడ్, కోశాధికారి చిర్ర ఉపేందర్ గౌడ్, గోపా భూపాలపల్లి జిల్లా కన్వీనర్ బుర్ర సునీత గౌడ్, ములుగు గోపా జిల్లా కన్వీనర్ కందాల రామయ్య గౌడ్, జనగామ గోపా జిల్లా అధ్యక్షుడు మేకపోతుల ఆంజనేయులు గౌడ్, మహబూబాబాద్ గోపా జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్ తదితరులు గౌడ పెద్దలు, పురస్కర గ్రహీతలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు