Monday, May 6, 2024

ఎక్కువ‌ గోల్స్ కొట్టిన ఫ్రాన్స్ ఆట‌గాడిగా ఎంబాపే గుర్తింపు..

తప్పక చదవండి

ఫుట్‌బాల్ స్టార్‌ కైలియ‌న్ ఎంబాపే స‌రికొత్త రికార్డు సాధించాడు. ఒకే సీజ‌న్‌లో ఫ్రాన్స్ త‌ర‌ఫున‌ అత్య‌ధిక గోల్స్ చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. అంతేకాదు, ఈసారి పీఎస్‌జీ క్ల‌బ్ త‌ర‌ఫున కూడా టాప్ గోల్ స్కోర‌ర్ అత‌నే. దాంతో, 65 ఏళ్ల రికార్డు బ‌ద్ధ‌లు కొట్టాడు. ఈ సీజ‌న్‌లో ఎంబాపే ఏకంగా 54 గోల్స్ కొట్టాడు. యూరో 2024 క్వాలిఫైయ‌ర్స్ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

గ్రీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ యంగ్‌స్ట‌ర్ 55వ నిమిషంలో పెనాల్టీని గోల్ పోస్ట్‌లోకి పంపి 54వ గోల్ ఖాతాలో వేసుకున్నాడు. గ‌తంలో ఈ రికార్డు దివంగ‌త స్ట్రైక‌ర్ జ‌స్ట్ ఫొంటేన్ పేరు మీద ఉంది. అత‌ను 1957-58లో ఒకే సీజ‌న్‌లో 53 గోల్స్ చేసి రికార్డు నెల‌కొల్పాడు. ఖ‌త‌ర్‌లో నిరుడు జ‌రిగిన‌ వ‌ర‌ల్డ్‌ క‌ప్ ఫైన‌ల్లో ఎంబాపే సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. హ్యాట్రిక్ గోల్స్ కొట్టి ఫ్రాన్స్‌ను గెలిపించినంత ప‌నిచేశాడు. అయితే.. షూటౌట్‌లో 4-2తో గెలిచిన అర్జెంటీనా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీని ఎగ‌రేసుకుపోయింది. టోర్నీలో అత్య‌ధికంగా 8 గోల్స్ కొట్టిన ఎంబాపేకు గోల్డెన్ బూట్ అవార్డు ద‌క్కింది.1

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు