Sunday, May 19, 2024

అక్రమాల చిట్టా..

తప్పక చదవండి
  • ఈఈ సనావుద్దీన్ అక్రమ చరిత్రలో ఎన్నెన్నో పుటలు..
  • అర్హులైన వారికి టెండర్ ఇవ్వకుండా ఎక్కువ కోట్ చేసిన వారికి కేటాయింపు..
  • ఒక్కటి కాదు ఇతగాని అవినీతి భాగోతాలు మరెన్నో ఉన్నాయి..
  • ప్రభుత్వ ఖజానాకి తీవ్రంగా గండి కొడుతున్న సనావుద్దీన్..
  • డిప్యుటేషన్ పై జీ.హెచ్.ఎం.సి. కి వచ్చి 15 సంవత్సరాలుగా తిష్టవేసి..
    అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన వైనం..
  • ఇతగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సామాజిక వేత్తలు..

తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ 8, సౌత్ జోన్ కు డిప్యుటేషన్ మీద వచ్చిన
షేక్ సనావుద్దీన్ గడచిన 15 సంవత్సరాలుగా ఇక్కడే తిష్టవేసి.. తన అవినీతి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు.. .. ఇదే విషయమై ఓ సామాజిక కార్యకర్త ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదుపై స్పందించిన జీఏడీ డిపార్ట్మెంట్, ( సర్వీసెస్ సి ) యూ.ఓ. నోట్ నెంబర్ 1900/సి.ఆర్. /ఏ 1/2023-1.. వి. శేషాద్రి సెక్రటరీ టు గవర్నమెంట్.. 18 మార్ఛి 2023లో సదరు షేక్ సనావుద్దీన్ పై చర్యలు తీసుకోమంటూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేశారు.. మరి ప్రభుత్వ పరిపాలనలో అత్యంత కీలకమైన శాఖ జీఏడీ నుంచి వచ్చిన ఆదేశాలంటే సదరు డిపార్ట్మెంట్ కు చెందిన ఎం.డీ. దేవసేనకు లెక్కలేదా..? లేక సదరు షేక్ సనావుద్దీన్ పైన ఉన్న అవ్యాజమైన అనురాగమా..? అదేకాకుండా అతగాడి అవినీతి సంపాదనలో ఆమెకు, మరికొందరు అధికారులకు సైతం వాటాలు అందుతుండటం వల్లనే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా..? అన్నది తేలాల్సి వుంది.. మరి ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. ఇతగాడి అవినీతి భాగోతంలో మరో ఘట్టం ఇప్పుడు చూద్దాం..

జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్, డివిజన్ – 8, ఉప్పుగూడా.. వార్డ్ నెంబర్ 44 ఎస్టీ కమ్యూనిటీ వారికి రిజర్వుడ్ గా ఉంది.. కాగా 5 నెలల పాటు అనగా 1-6-2022 నుండి 31-10-2022 వరకు వర్షాకాలంలో ఎదురైయ్యే సమస్యలను పరిష్కరించే నిమిత్తం ఎంగేజింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ వెహికల్, టాటా ఏస్ / ట్రాక్టర్, డ్రైవర్ తో కలిపి, లేబర్ మొదలైన అంశాలను నిర్వహించడానికి టెండర్ ఎన్.ఐ.టి. 08/ఈఈ-8/సౌత్ జోన్/జీ.హెచ్.ఎం.సి. 2022 – 2023 తేదీ : 23 మే 2022. ఐటం నెంబర్ : 6.. టెండర్ విలువ రూ. 13, 04,585. గా పిలవడం జరిగింది.. అయితే ఈ టెండర్ లో వీ. గౌతమ్ నాయక్, శ్రీదేవి లూనావత్ అనే ఇద్దరు కాంట్రాక్టర్ లు తమ కొటేషన్ లను పంపించారు.. ఇందులో వీ. గౌతమ్ నాయక్ 0.1 శాతం తక్కువలో పని చేస్తానని తెలిపారు.. ఇక శ్రీదేవి లూనావత్ టెండర్ విలువకు 25 శాతం తక్కువలో చేస్తానని తన టెండర్ లో కోట్ చేశారు.. అయితే తక్కువ కోట్ చేసిన శ్రీదేవికి టెండర్ ఇవ్వకుండా చక్రం తిప్పిన ఈ.ఈ. షేక్ సనావుద్దీన్.. లోపాయికారి ఒప్పొందం చేసుకుని వీ. గౌతమ్ నాయక్ కు టెండర్ కేటాయించడం జరిగింది.. సనావుద్దీన్ చేసిన ఈ అవినీతి వ్యవహారం వలన రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ. 3,35,000 నష్టం వాటిల్లింది.. మరో ఆశ్ఛర్యకరమైన విషయం ఏమిటంటే సదరు కాంట్రాక్టర్ వీ. గౌతమ్ నాయక్ కు తాను చేసిన పనికి గాను పూర్తి బిల్లు కూడా శాంక్షన్ అయ్యింది.. ఇందులో కూడా సనావుద్దీన్ హస్తం ఉన్నట్లు తేటతెల్ల మవుతోంది.. ఇదొక్కటే కాదు ఇలాంటి అవినీతి కార్యక్రమాలు సదరు ఈ.ఈ. సలావుద్దీన్ కనుసన్నలలో ఎన్నెన్నో జరుగుతున్నాయి.. ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి.. తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు