Friday, March 29, 2024

నేను పోను..( డిప్యుటేషన్ పై జీ.హెచ్.ఎం.సి. లోకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట..)

తప్పక చదవండి
  • నాకు అక్రమ ఆదాయం వస్తే చాలు అంటున్న ఉద్యోగి..
  • సొసైటీలోని సిస్టం డిస్ట్రబ్ అయినా డోంట్ కేర్ అంటున్న ఉద్యోగి..
  • జీఏడీ ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోని టి.జీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. మేనేజింగ్ డైరెక్టర్..
  • ఉన్నతాధికారులు సైతం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ సనావుద్దీన్ కు వంతపాడుతున్న వైనం..
  • ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక కార్యకర్తలు..

సొసైటీలో సిస్టం సక్రమంగా పనిచేయాలనంటే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది.. ఒక వాహనం నడవాలంటే నాలుగు చక్రాలు సరిగా ఉంటేనే ప్రయాణం సజావుగా సాగుతుంది.. అందులో ఒక చక్రం సరిగా పనిచేయకపోయినా అర్ధాంతరంగా జర్నీ ఆగిపోతుంది.. అలాంటి పరిస్థితులే ఇప్పుడు కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్లో చోటుచేసుకుంది.. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ వారికోసం పనిచేయాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. వచ్చే జీతంతో సంతృప్తి పడకుండా.. అక్రమ సంపాదన కోసం అర్రులు చాస్తున్నారు.. ప్రతిష్టాత్మకమైన జీ.హెచ్.ఎం.సి. లో ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.. ఇతర డిపార్టుమెంట్ల నుండి జీ.హెచ్.ఎం.సి. కి డిప్యుటేషన్ మీద వచ్చిన కొందరు ఉద్యోగులు.. ఇక్కడ అక్రమ సంపాదన కళ్ళముందు కనిపిస్తుండటంతో సంవత్సరాల తరబడి ఇక్కడే పాతుకుపోతున్నారు.. నిజానికి డిప్యుటేషన్ మీద వచ్చిన వారు మూడు సంవత్సరాలు పనిచేసిన అనంతరం తమ మాతృ డిపార్టుమెంటుకు వెళ్లాల్సి ఉంటుంది.. కొన్ని ప్రత్యేక పరిష్టితుల్లో మరో రెండేళ్లు అతడి విధుల కాలం పొడగించవచ్చు.. కానీ 15 సంవత్సరాలుగా జీ.హెచ్.ఎం.సి. లోనే పాతుకుపోయిన ఓ ఉద్యోగి షేక్ సనావుద్దీన్ కథ ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ 8, సౌత్ జోన్ కు డిప్యుటేషన్ మీద వచ్చిన
షేక్ సనావుద్దీన్ గడచిన 15 సంవత్సరాలుగా ఇక్కడే తిష్టవేసి.. తన అవినీతి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇదే విషయమై ఓ సామాజిక కార్యకర్త ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదుపై స్పందించిన జీఏడీ డిపార్ట్మెంట్, ( సర్వీసెస్ సి ) యూ.ఓ. నోట్ నెంబర్ 1900/సి.ఆర్. /ఏ 1/2023-1.. వి. శేషాద్రి సెక్రటరీ టు గవర్నమెంట్.. 18 మార్ఛి 2023లో సదరు షేక్ సనావుద్దీన్ పై చర్యలు తీసుకోమంటూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేశారు.. మరి ప్రభుత్వ పరిపాలనలో అత్యంత కీలకమైన శాఖ జీఏడీ నుంచి వచ్చిన ఆదేశాలంటే సదరు డిపార్ట్మెంట్ కు చెందిన ఎం.డీ. దేవసేనకు లెక్కలేదా..? లేక సదరు షేక్ సనావుద్దీన్ పైన ఉన్న అవ్యాజమైన అనురాగమా..? అదేకాకుండా అతగాడి అవినీతి సంపాదనలో ఆమెకు, మరికొందరు అధికారులకు సైతం వాటాలు అందుతుండటం వల్లనే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా..? అన్నది తేలాల్సి వుంది.. మరి ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది..

- Advertisement -

ఇదే విషయమై సదరు ఉద్యోగి షేక్ సనావుద్దీన్ ని వివరణ కోరగా తన మాతృ డిపార్ట్మెంట్ అయిన తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో గత కొద్ది కాలంగా జీతాలు చెల్లించడం లేదని.. అందుకే తాను జీ.హెచ్.ఎం.సి. లోనే కొనసాగుతున్నానని చెప్పడం జరిగింది.. అయితే అక్కడ పనిజేస్తున్న మిగతా ఉద్యోగులు తమకు జీతాలు అందకపోతే ఎందుకు ఆందోళన చేయడం లేదు..? కేవలం తప్పించుకోవడానికే జీతాలు ఇవ్వడంలేదనే నెపాన్ని షేక్ సనావుద్దీన్ ప్రభుత్వం మీద నెట్టేస్తున్నట్టుగా ఉంది.. జీ.హెచ్.ఎం.సి. నుంచి తిరిగి వెళ్ళిపోతే తనకు వచ్చే పై ఆదాయం దొరకకుండా పోతుందనే ఈ ఎత్తుగడ వేశాడని సామాజిక కార్యకర్త ఆరోపిస్తున్నారు.. పైగా ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మన ఊరు, మన బడి కార్యక్రమం ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి స్కూళ్ల పునరుద్ధరణ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేబడుతోంది.. అలాంటప్పుడు అక్కడ జీతాలు రావడం లేదన్నది వాస్తవం కాదు.. మన ఊరు మన బడి కార్యక్రమం, సమగ్ర శిక్ష ద్వారా ఎన్నెన్నోమంచి కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంటే.. ఆకార్యక్రమాల్లో పాలుపంచుకుని విధులు నిర్వహించవలసిన గురుతర బాధ్యతను వదిలిపెట్టి కేవలం అక్రమ సంపాదన వైపు మొగ్గుచూపడం ఎంతవరకు సమంజసం..? ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న ఇలాంటి ఉద్యోగులు గతితప్పి ప్రవర్తిస్తుంటే.. సమాజంలోని సిస్టం భ్రష్టుపట్టి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకుని, జీఏడీ ఇచ్చిన ఆదేశాలను గౌరవించి షేక్ సనావుద్దీన్ లాంటి ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకుని పెడదారి పడుతున్న వారిని గాడిలో పెట్టాలని, తద్వారా ప్రభుత్వ ఆశయాలను సజీవంగా ఉంచాలని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.. జీ.హెచ్.ఎం.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ సనావుద్దీన్ చేస్తున్న అవినీతి బాగోతాలపై అన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు