- నేడు ఢిల్లీ వెళ్లనున్న ప్రజా యుద్ధ నౌక..
- ఈసీ అధికారులతో కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్..
- ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగుల్లో జెండా..
- జెండా మధ్యలో పిడికిలి గుర్తు..
హైదరాబాద్, “గద్దర్ ప్రజా పార్టీ” పేరుతో గద్దర్ కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఈసీ అధికారులను కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నారు. గద్దర్ విప్లవానికి పోరాటానికి ప్రతీక. అందువల్లే “గద్దర్ ప్రజా పార్టీ” జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే జెండా మధ్యలో పిడికిలిని పెట్టారని సమాచారం. ఈ మూడు రంగుల్లో ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులతో రూపొందించారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గద్దర్ తన ప్రయాణాన్ని ఎరుపురంగుతో ప్రారంభించారు. గద్దర్ మొదటగా అంబేద్కరిస్టు.. కాలానుగుణంగా ఆయన వామపక్ష రాజకీయాలపై ఆకర్షితులయ్యారు. అందుకే నీలి రంగు కూడా జెండాలో తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు.