Sunday, September 15, 2024
spot_img

సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌..

తప్పక చదవండి
  • ఘనంగా వీడ్కోలు పలికిన టీఎస్ హైకోర్టు న్యాయవాదులు..
  • 2020 జూన్ 28 నుంచి భూయాన్ హై కోర్టు
    చీఫ్ జస్టిస్ గా కొనసాగుతున్నారు..

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయిన చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు తెలంగాణ హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదటి కోర్టు హాల్లో మధ్యాహ్నం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను సత్కరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌ వెంకటనారాయణ భట్టి పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ బుధవారం ట్విట్టర్‌లో వెల్లడించారు.. జస్టిస్‌ భూయాన్‌ తెలంగాణ హైకోర్టు, జస్టిస్‌ భట్టి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. 2022, జూన్‌ 28 నుంచి తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా భూయాన్‌ కొనసాగుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు