Sunday, May 5, 2024

అంటురోగంతో అంటగాగుతున్న ఎంటమాలజీ డిపార్ట్మెంట్..

తప్పక చదవండి
  • అవినీతి వైరస్ సోకిన జీ.హెచ్.ఎం.సి. ఎల్.బీ. నగర్ జోన్..

జీ.హెచ్.ఎం.సి. లో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైనది.. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.. నీటి కుంటల్లో గుర్రపుడెక్కను తొలగించడం.. కాలనీల్లో స్వైరవిహారం చేస్తున్న ప్రమాదకర దోమలను తరిమి కొట్టడం వీరి ప్రధాన విధి.. అయితే ఈ విధులను గాలికి వదిలేసిన కొందరు అధికారులు, ఉద్యోగులు అందులో కూడా అడ్డదారులు వెతుక్కోవడం, అవినీతి సొమ్మును వెనుకేసుకోవడం అత్యంత హేయమైన చర్య.. జీ.హెచ్.ఎం.సి. పరిధిలోని ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్నా.. అక్రమ సంపాదనవైపు మొగ్గుచూపుతున్నారు.. తాజాగా ఎల్.బీ. నగర్ జీ.హెచ్.ఎం.సి. ఎంటమాలజీ డిపార్ట్మెంట్ లో అంతులేని అవినీతి వెలుగు చూసింది.. ఇందులో పనిచేసే ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారు.. అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రవీంద్రనాథ్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. తమ విధుల్లో భాగంగా చిత్తశుద్ధితో చేయాల్సిన పనుల్లో సైతం అక్రమార్జనకు తెగబడుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. స్థానికంగా నెలకొని ఉన్న చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించే విషయంలో తన చేతివాటం చూపుతున్నాడు.. అదేవిధంగా కోవిడ్ సమయంలో విధుల నిర్వహణకు 30 మంది వర్కర్స్ ని ఏర్పాటు చేసుకుని వారు తమ విధులకు హాజరు కాకున్నా హాజరు పట్టీలో చూపిస్తూ వారి జీతం కూడా కాజేసినట్లు తెలుస్తోంది.. ఇదే కాకుండా స్థానికంగా దోమల నివారణకు వాడే ఫాగింగ్ ప్రక్రియలో సైతం అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.. ఎల్.బీ. నగర్ జీ.హెచ్.ఎం.సి. ఎంటమాలజీ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న ఎంటమాలజిస్ట్ రవీంద్రనాథ్ రెడ్డి చేస్తున్న అరాచకాల చిట్టాను, అతగాడు చేస్తున్న అనైతిక కార్యక్రమాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది.. ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

కాగా వివరాలకోసం ఆర్.టి.ఐ. ద్వారా దరఖాస్తు చేసుకున్నా తమ డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో అన్న మీమాంసతో అధికారులు అడిగిన సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు