Sunday, October 13, 2024
spot_img

విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్..

తప్పక చదవండి

ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించాడు (teacher chops students hair). దీంతో ఆ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై వివాదం రాజుకున్నది. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది. మజులి జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ స్కూల్‌లో గురువారం ఉదయం విద్యార్థులు ప్రేయర్‌ కోసం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిక్కీ అనే టీచర్‌ జుట్టు ఎక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించాడు. 30 మంది విద్యార్థుల హెయిర్‌ను అతడు కట్‌ చేశాడు. కాగా, అందరి ముందు టీచర్‌ తమ జుట్టును కట్‌ చేయడంపై ఆ విద్యార్థులు అవమానంగా భావించారు. తాము స్కూల్‌కు వెళ్లబోమంటూ కొందరు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆ స్కూల్‌కు వెళ్లి ఈ విషయంపై టీచర్లను నిలదీశారు. అయితే తమ చర్యను స్కూల్‌ ఉపాధ్యాయులు సమర్థించుకున్నారు. నిబంధనల్లో భాగంగా జుట్టు ఎక్కువగా ఉన్న విద్యార్థులపై ఈ మేరకు క్రమశిక్షణ కింద చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే స్కూల్‌ అధికారుల సూచనతోనే తాను విద్యార్థుల హెయిర్‌ కట్‌ చేసినట్లు టీచర్‌ నిక్కీ తెలిపాడు.

మరోవైపు ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో 30 మంది విద్యార్థుల జుట్టును ఉపాధ్యాయుడు కట్‌ చేసిన అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అలాగే విద్యార్థుల జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ స్కూల్‌లో కత్తిరించాలన్న మార్గదర్శకాలు ఎక్కడా లేవని అన్నారు. ఆ రోజు స్కూల్‌లో ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు