Tuesday, May 21, 2024

ప్రజా రంజక పాలకుడిగా ‘కేసీఆర్’ ప్రపంచంలోనే ఆదర్శ ప్రజా ప్రతినిధి..

తప్పక చదవండి
  • డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు..

సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పాలన ప్రపంచంలోనే ఆదర్శ ప్రజా ప్రతినిధిగా నిలుపుతున్నదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. పదేళ్లలోపే వందేళ్ల ప్రగతికి బాటలు వేసిన ముఖ్య మంత్రిగా కేసీఆర్ చరిత్ర పుటలలో తన స్థానంను సుస్థిరం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. శనివారం నాడు ట్రై యాంగిల్ తెలంగాణ అసోసియేషన్ డాక్టర్ వకుళాభరణంకు ఆత్మీయ అభినందన సభను నిర్వహించింది. ఈ కార్యక్రమం నార్త్ కరోలీనా రాష్ట్రం (అమెరికా), “ర్యాలీ” పట్టణంలో జరిగింది. ఇక్కడి ఒక ప్రముఖ హోటల్ లో జరిగిన ఈ సమ్మేళనంలో డాక్టర్ వకుళాభరణంను ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజుసిరి అధ్యక్షత వహించగా, నారాయణ, అన్వేష్ లు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
ఈ సందర్బంగా జరిగిన సమ్మేళనంలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ… తనకు జరిగిన అభినందన సభ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఆహ్వానించలేని కొన్ని శక్తులు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారాలతో లబ్ది పొందాలని చూస్తున్నారని, ఇలాంటి కుట్రలను భగ్నం చేయడానికి వీలుగా ఎన్.ఆర్.ఐ. తెలంగాణవాదులు, సామాజిక మాధ్యమాల ద్వారా సాధికారికంగా తిప్పి కొట్టాలని కోరారు. రాష్ట్ర సాధనలో ఎలాగైతే, నైతికంగా మద్దతుగా నిలిచారో, అదే ఉద్యమ స్పూర్తితో ఎన్.ఆర్.ఐ. లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రగతి కారకమైన ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, నీరు మున్నగు అంశాలపై సుదీర్ఘంగా వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, పూర్తి సమాచారయుతంగా డాక్టర్ వకుళాభరణం కీలక ఉపన్యాసం చేశారు.

ఈ నెల 2 వ తేదీన అమెరికా బయలుదేరిన డాక్టర్ వకుళాభరణం ఫిలడెల్ఫియా 7,8,9 వ తేదీలలో జరిగిన 23 వ తానా మహా సభలలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ‘తానా’ ఈ ఏడాదిగాను కృష్ణ మోహన్ కు ‘మహాత్మా జ్యోతిభా ఫూలే’ పురస్కారం అందజేసింది. అనంతరం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో హౌస్టన్, షుగర్ ల్యాండ్, డల్లాస్, న్యూ జెర్సీ, న్యూ యార్క్, నార్త్ కరోలినా ‘ర్యాలీ’ లలో జరిగిన ఆత్మీయ అభినందనలలో పాల్గొని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం ప్రగతిలపై కీలకోపన్యాసాలు చేశారు. ఈ నెల 25 న తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు