Saturday, May 4, 2024

నగరం నిద్రిస్తున్న వేళ..

తప్పక చదవండి
  • రెడ్ లైట్ ఏరియాను తలపిస్తున్న దిల్ సుఖ్ నగర్ మెట్రో జోన్
    పరిసర ప్రాంతాలు…
  • పోలీస్ స్టేషన్ కూత వేట దూరంలో..
  • వ్యభిచారం చేసే వారిని చైతన్య పరచాలి..
  • స్థానిక నేతలు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి..
  • విజ్ఞప్తి చేస్తున్న స్థానిక ప్రజానీకం..

దేశ ప్రధాన నగరాలలో ముఖ్యమైన నగరం హైదరాబాద్.. ఈ మహా నగరానికి ఎంతో చరిత్ర ఉంది.. దేశం నలువైపుల నుండి ఎందరో వ్యాపారవేత్తలు, సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు ఈ మహానగరంలో జీవిస్తున్నారు… భిన్న సంస్కృతుల నగరంగా హైదరాబాద్ పేరుగాంచింది..

కాగా ఈ మహానగరంలో నివసించడానికి మొదటగా ఎంచుకునే ప్రాంతం దిల్ సుఖ్ నగర్… ఈ ప్రాంతం జీవనోపాధి వ్యాపార, గృహ నివాసాల సముదాయం, విద్యారంగం, వైద్యం, షాపింగ్ మాల్స్.. తదితర వసతులు కల్గిన ప్రాంతం దిల్ సుఖ్ నగర్.. ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా కమర్షియల్ హబ్ గా మారిపోయింది.. దిల్ సుఖ్ నగర్, మెట్రో స్టేషన్, బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి.. ముఖ్యంగా రాత్రి సుమారుగా 10 గంటల సమయంలో దిల్ సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలు వారు వ్యాపారం, విధులు ముగించుకొని నివాసాలకు వెళ్ళే సమయం.. మరో వైపు పక్క రాష్ట్రలకు ప్రయాణం చేసే ప్రయాణికులు మరో వైపు.. నగరం నిద్రపోతున్న వేళ.. అసలు కథ ప్రారంభం అవుతుంది.. సరూర్ నగర్, చైతన్యపురి, పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్ సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నుండి కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ వరకు కొందరు వ్యభిచారం చేసే మహిళలు, విటుల ఆకర్షణే లక్ష్యంగా బేర సారాలకు అడ్డాగా మార్చుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు.. ఓ వైపు రద్దీ ప్రాంతం, మరో వైపు సాయి బాబా టెంపుల్.. మరో వైపు రక్షక భట నిలయం.. వీటి మధ్య వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు.. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్, సిబ్బంది పెట్రోలింగ్ వాహనంతో ఈ ప్రాంతంలో అనునిత్యం గస్తీ నిర్వహిస్తూనే ఉంటారు. అయినా వ్యభిచార దందా చేసే కొందరు మహిళలు ఏ మాత్రం భయం లేకుండా వారి పని వారు చేసుకుంటున్నారు..

- Advertisement -

ఆ సమయంలో ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కొందరు మహిళలలు, బందువులు, స్నేహితులతో కలిసి పలు రకాల కారణాలతో అటు వైపుగా వెళ్తే.. వ్యభిచార గ్రూపుకు చెందిన వారుగా కొంతమంది అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని.. ఆ చేదు అనుభవం తమని కలచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు ఈ ప్రాంతంలో ఎక్కువగా నిరుద్యోగులు, యువకులు నివసిస్తుంటారు.. ఇలా వ్యభిచారం చేసే మహిళల, వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుందని. ఈ ప్రాంతం రాత్రి 10 గంటల సమయం అయితే.. రెడ్ లైట్ ఏరియాగా మారిపోతుందని.. వీలైనంత తొందరగా స్థానిక ప్రజా ప్రతినిధులు, కాలనీ వాసులు, సాయిబాబా టెంపుల్ కార్యవర్గ సభ్యులు, మహిళా సంఘాలు, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను, సమాజాన్ని చైతన్య పరిచే వ్యక్తులు, ముందుకు వచ్చి.. వ్యభిచార వృత్తిని ఎంచుకున్న మహిళలకు సామాజిక స్పృహతో వారికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి.. వారికి ఏదైనా ఒక ఉపాధిని కల్పించి, సమాజంలో ఒకరుగా జీవించేలా చేయాలని… ఈ ప్రాంతం పూర్తిగా రెడ్ లైట్ ఏరియాగా మారక ముందే.. ఆదిలోనే అంతం చేయాలని పలువురు సామాజిక కార్యకర్తలు పోలీసు ఉన్నతాధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు, సాయిబాబా టెంపుల్ కార్యవర్గ సభ్యులకు, కాలనీ వాసులకు, స్వచ్ఛంద సంస్థలకు, విజ్ఞప్తి చేస్తున్నారు.. ఈ సంఘటనపై గడ్డిఅన్నారం డివిజన్, లలిత నగర్ కాలనీ వాసులు స్థానిక సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని… స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక వ్యాపారస్తులు… మరో అడుగు ముందుకేసి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక కాలనీవాసులు కోరుతున్నారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు