Saturday, July 27, 2024

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్‌..

తప్పక చదవండి


అమరావతి, 10 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు.. దేవాదాయ శాఖ పూజలు, యజ్ఞాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.. ధార్మిక పరిషత్, ఆగమ సలహా మండలి సూచనలతోనే యజ్ఞం చేశామని తెలిపారు.. బాబూ.. దేవుడితో పరాచకాలడితే ఇంకా పాతాళానికి పోతావ్ అని హెచ్చరించారు.. మోసం, దగా, వెన్నుపోటు, అవినీతి కలిపితే చంద్రబాబు అన్నారు.. నైతిక విలువల్లేని ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు.. అధికారం కోసం బాబు అబద్ధాలు, అడ్డదారులు తొక్కుతున్నారు.. బాబు 14 ఏళ్లు సీఎంగా చేసి ఏపీని పాతాళానికి తొక్కేశాడు.. 2019లో ప్రజలు ఛీ కొట్టినా మళ్లీ మాయమాటలు చెబుతున్నాడు.. చంద్రబాబు లాంటి నీచుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం.. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు.. అవినీతి అనకొండ చంద్రబాబు.. బాబు రెండెకరాల నుంచి రూ.లక్షల కోట్లకు ఎలా పడగలెత్తాడు..? చంద్రబాబు పాలనలో అంతా దుర్భిక్షం, కరువు కాటకాలే.. 2024లో బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు