Monday, April 15, 2024

దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్..

తప్పక చదవండి

  • ఎంపీటీసీల పోరం రాష్ట్ర కార్యదర్శి, వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు గదరాజు యాదగిరి

హైదరాబాద్, 10 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000కి పెంచుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం చేర్యాల మండల కేంద్రంలోనీ స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు గదరాజు యాదగిరి అధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన వికలాంగులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గదరాజు యాదగిరి మాట్లాడారు. ఇప్పటి వరకు దివ్యాంగులకు రూ.3116/- పెన్షన్‌ ఇస్తుండగా, దానిని రూ.4116/-కు పెంచుతూ..పెంచిన పెన్షన్ వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో దివ్యాంగుల ఆనందానికి అవధులు లేవనీ, మా వికలాంగులం సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని ధీమా వ్యక్తంచేశారు. సిఎం కేసీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ తమ పాలిట దేవుడని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో కన్న బిడ్డలే చూసుకొని ఈ తరుణంలో నెల నెల పెన్షన్ ఇస్తూ.. వెయ్యి రూపాయలు పెంచి మాకు పెద్ద కొడుకుల సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని వృద్ధ వికలాంగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, ఇప్పాల బాల నర్సయ్య, మొహన్ రెడ్డి, చింతకింది ప్రేమలత, ఆరుట్ల లక్ష్మి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు