Wednesday, May 15, 2024

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు..

తప్పక చదవండి

మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సేఫ్టీ, ఐటీ త‌దిత‌ర విభాగాల‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ, రిగ్గర్ ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి కేరళ కొచ్చిలోని భార‌త‌ ప్రభుత్వరంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబందిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ సీఏ/ ఐసీఏఐ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిగ్గర్ ట్రెయినీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ, ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభంకాగా.. జూలై 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు : 60.. పోస్టులు : ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ, రిగ్గర్ ట్రెయినీ.. విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సేఫ్టీ, ఐటీ త‌దిత‌రాలు.
అర్హతలు : ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబందిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ సీఏ/ ఐసీఏఐ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిగ్గర్ ట్రెయినీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు : 18 నుంచి 27 ఏండ్లు (పోస్టుల‌ను అనుస‌రించి) మించకూడదు.
జీతం : 1. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల‌కు నెలకు రూ.40,000 నుంచి 140000.. 2. రిగ్గర్ ట్రెయినీ పోస్టుల‌కు రూ.6000 నుంచి రూ.7000.. ఎంపిక : ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ, ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు: 1. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల‌కు రూ.1000. 2. రిగ్గర్ ట్రెయినీ పోస్టుల‌కు రూ.600.. దరఖాస్తు : ఆన్‌లైన్‌లో.. చివరి తేది: జూలై 20.. వెబ్‌సైట్ : www.cochinshipyard.com

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు