Friday, September 20, 2024
spot_img

చంద్రముఖి బంగ్లాలో లారెన్స్‌..

తప్పక చదవండి

కొరియోగ్రాఫర్‌ కమ్‌ హీరో రాఘ‌వా లారెన్స్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. పీ వాసు డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. కాగా మేకర్స్ ముందుగా తెలిపిన ప్రకారం కొత్త లుక్‌ ఒకటి విడుదల చేశారు. రాఘవా లారెన్స్ చంద్రముఖి బంగ్లా ద్వారంలోకి ఎంట్రీ ఇచ్చి.. తలుపులో నుంచి లోపలికి చూస్తున్న లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. చంద్రముఖి 2 తలుపులు గణేశ్‌ చతుర్థికి తెరుచుకోనున్నాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుందని అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఇప్పుడీ లుక్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

చంద్రముఖి 2 చిత్రానికి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు విన్నర్‌ ఎంఎం కీరవాణి సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు, టైటిల్ లుక్ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రముఖి 2 నయా లుక్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తుంది. సుబాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చంద్రముఖి 2లో లెజెండ‌రీ కమెడియ‌న్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు