యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సెంచరీలతో కదం తొక్కుడుతున్నాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అతను సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 32వ శతకం. దాంతో ఆస్ట్రేలియా లెజెండ్ స్టీవ్ వా టెస్టు సెంచరీల రికార్డును అతను సమం చేశాడు. అలాగే.. ఆసీస్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో ఆటగాడిగా స్మిత్ పేరు తెచ్చుకున్నాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 41సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతేకాదు వేగంగా 32 సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌గా స్మిత్ మరో ఘనత సాధించాడు. 99వ టెస్టు ఆడుతున్న ఈ స్టార్ ప్లేయర్ 174 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సొంతం చేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో స్మిత్ వంద కొట్టిన విషయం తెలిసిందే. రెండో టెస్టులోనూ అతను తన ఫామ్ కొనసాగించాడు. రెండో టెస్టులో.. ఓవర్ నైట్ స్కోర్ 85తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన స్మిత్ వేగంగా ఆడాడు. అండర్సన్ బౌలింగ్‌లో కవర్ డ్రైవ్‌తో బౌండరీ కొట్టి వందకు చేరువయ్యాడు. అయితే.. వేగంగా ఆడే క్రమంలో జోష్ టంగ్ ఓవర్లో బెన్ డకెట్ చేతికి చిక్కి ఔటయ్యాడు. రాబిన్సన్ మూడు, రూట్ రెండేసి వికెట్లతో చెలరేగడతో తొలి సెషన్‌లోనే ఆసీస్ 416 పరుగులకే కుప్పకూలింది.