Wednesday, May 1, 2024

7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు..

తప్పక చదవండి
  • నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్..

దేశంలోని పలు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.. జార్ఖండ్, త్రిపుర, కేరళ, వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నికలు జరుగనున్నాయి..

జార్ఖండ్ లోని, 33-డుమ్రి స్థానంలో జగన్నాధ్ మహతో మరణంతో ఉప ఎన్నిక జరుగనుంది.. కేరళ రాష్ట్రంలో 98-పుత్తుపల్లిలో ఉమెన్ చాందీ మరణంతో ఉప ఎన్నిక, త్రిపుర రాష్ట్రంలో 20-బోక్స్ నగర్ లో సంసుల్ హాక్యూ మరణంతో ఉపఎన్నిక, 23-ధన్ పూర్ లో ప్రతిమా భౌమిక్ రాజీనామాతో ఉప ఎన్నిక, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 15-ధూప్ గురి (ఎస్సీ)లో బిష్ణు పాద రాయ్ మరణంతో ఉప ఎన్నిక, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 354-ఘోషిలో దారాసింగ్ చౌహన్ రాజీనామాతో ఉప ఎన్నిక, ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో 47-భాగేశ్వర్ (ఎస్సీ)లో చందన్ రామ్ దాస్ మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి..

- Advertisement -

ఈనెల 10న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 17వ తేదీ, 18న స్క్రూటినీ, 21వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, సెప్టెంబర్ 5న ఎన్నికలు, 8న కౌంటింగ్ జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు