Sunday, April 28, 2024

సీబీఐ అదుపులో ముగ్గురు రైల్వే ఉద్యోగులు..

తప్పక చదవండి
  • ఒడిశా రైలు ప్రమాద కేసు ఘటనలో కీలక పరిణామం..
  • సాక్ష్యాలు నాశనం చేశారన్న అభియోగాలపై కేసు..
  • ఇప్పటికి గుర్తించని 42 మృతదేహాలు..
  • ఎయిమ్స్‌ మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు..

భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. గత నెల 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సవిూపంలో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగి నెల రోజులు గడిచిపోయింది. అయినా, మృతదేహాల గుర్తింపు పక్రియ మాత్రం ఇంకా పూర్తికాలేదు. చనిపోయిన వారిలో ఇంకా 42 మందికి సంబంధించిన వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అందులో కొన్నింటిని గుర్తించి వారివారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన 81 మృతదేహాలకు ఇటీవలే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. అందులో 39 మంది మృతదేహాలను గుర్తించి వాటిని దహన సంస్కారాల నిమిత్తం వారి కుటుంబాలకు అప్పగించారు. ప్రస్తుతం 42 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఆ 42 మృతదేహాలకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు. వారి బంధువులు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం వాటిని భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఆ డెడ్‌ బాడీస్‌ కు నిర్వహించిన డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ త్వరలో రానున్నట్లు అధికారులు వెల్లడిరచారు. కాగా, తాజాగా అరెస్ట్ అయిన ముగ్గురు ఉద్యోగుల వివరాలను సీబీఐ అధికారులు తెలిపారు. అఱుణ్ కుమార్ మహంతా, జూనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎండీ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌గా గుర్తించారు. ఈ ముగ్గురి మీద ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను నాశనం చేయడం సహా వివిధ అభియోగాలను వీరిపై సీబీఐ అధికారులు మోపారు. జూన్ 2 వ తేదీన ప్రమాదం జరగ్గా.. జూన్ 6 వ తేదీన సీబీఐ అధికారులు ఈ కేసును తమ అధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పలువురు రైల్వేశాఖ ఉద్యోగులు, సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు.. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా తాజా అరెస్ట్‌లు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు