నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ కాలేజ్ సందర్శనకు వెళ్లిన నాయకురాలు..
హైదరాబాద్, 19.06.2023 నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐఐటీ లో ముగ్గురు విద్యార్థినులు మొన్న ఆత్మ హత్య చేసున్నారు. ఆ సందర్భంగా సోమవారం రోజు ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళి కారణాలు తెలుసుకోవాలని, సహ విద్యార్థినులకు భరోసా ఇద్దామని వెళ్లిన బీజేపి మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ని, ఇతర బీజేపి నాయకులను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి బాసర పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళారు.. పోలీస్ స్టేషన్ లో బీజేపి నేతలకు, పోలీసులకు వాగ్వాదం నడిచింది.. కేవలం పరామర్శించడానికి, కారణం తెలుసుకోవడానికి వెళితే అరెస్ట్ చేస్తారా అని గీతా మూర్తి పోలీసుల మీద మండి పడ్డారు..