Thursday, May 2, 2024

బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుంది..

తప్పక చదవండి
  • ఉమ్మడి సీఎం అభ్యర్థిపై కలిసి నిర్ణయం
  • ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి..
  • మిగిలిన పార్టీలతో పొత్తు నిర్ణయం కేంద్ర కమిటీదే..

బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందని ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జనసేనతో పొత్తు ఇవాళే కాదు, రేపు కూడా ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే.. మిగిలిన పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిని కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందన్నారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే.. అక్కడి నుంచే తాను పోటీ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.. కేంద్రం ఇస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని.. పంచాయతీల పరిస్థితే అందుకు ఉదాహరణ అని పురందేశ్వరి ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. తాను పార్టీ అధ్యక్షురాలిని అయ్యాక మొదట రాష్ట్రంలో పంచాయతీల అంశాన్ని తీసుకున్నానని అన్నారు. నిధుల దారి మళ్లింపుపై సర్పంచ్‌లు పార్టీలకతీతంగా తమ మద్దతు కోరారని.. ఏపీ బీజేపీ వారికి పూర్తి మద్దతు అందిస్తుందని భరోసా కల్పించారు. గోదావరి జిల్లాలకు, రాష్ట్రానికి కేంద్రం పలు సంస్థలు కేటాయించిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి సిద్థంగా ఉన్నామన్నారు. ఆవ భూముల్లో అవకతవకలకు పాల్పడ్డారని.. మడ అడవులని నరికించేశారని పురందేశ్వరి మండిపడ్డారు. రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందని ఆరోపణలు చేశారు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్‌ పనులు నత్తనడకన సాగడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఏమాత్రం కేటాయించడం లేదని వ్యాఖ్యానించారు. ఆగస్టు 15వ తేదీన సర్పంచుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు ఫురందేశ్వరి పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు