- బీసీ పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త..
- బ్లాంకెట్లు, బేడీషీడ్స్, నోట్ బుక్స్ అందించేలా ప్రణాళిక..
- 35 వేలమంది విద్యార్థులకు చేకూరనున్న లబ్ది..
బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు తెలంగాణ సర్కారు శుభవార్త తెలిపింది. కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్లాంకెట్లు, బెడ్ షీట్స్, నోట్ బుక్స్ తదితరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 302 బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 35 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీటి కోసం ప్రతి ఏటా 15 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది. బీసీ హాస్టళ్ల ద్వారా వేల మంది పేద విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తున్నారు. గతంలో హాస్టళ్లలో డైట్ ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకోవడాన్ని ఆ సంఘాలు స్వాగతించాయి.