Saturday, July 27, 2024

భూరక్షణే జన రక్షణ

తప్పక చదవండి

ప్రకృతి ప్రసాదిత మైన భూమిని మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. మానవ జాతి మనుగడకు ఆధారమైన భూమిని అభివృద్ధి పేరుతో విద్వసం చేస్తు ఆహార కొరత ను సృష్టించడం గమనార్హం. ఆహారం జీవనాన్ని ఇచ్చే భూమిని నాశనం చేస్తున్నాడు. వ్యర్ధాలు భూసారం.. గృహ వ్యర్థాలు చెత్తాచెదారం వల్ల భూసారం దెబ్బతింటుంది. మన దేశములో ప్రతి రోజూ 15 వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడిరచాయి. వివిధ రకాల ప్లాస్టిక్‌ వ్యర్థాలు కొన్నివంధల సంవత్సరాల వరకు భూమి లో నాశనం కాకుండా నిలువ వుండడం వల్ల భూమి ఉత్పాదకత శక్తి తగ్గుతుంది.జాతీయ ఉత్పత్తి ఉత్పాదకత తగ్గి ప్రజల ఆదా యాలు జీవన ప్రమాణాలు ఆశించిన మేరకు పెరగలేదు. ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఎకనామిక్‌ ఫోరమ్‌ ఆందోళన.. పశువులు పక్షులు ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తినడం వల్ల చనిపోతున్నాయి. ప్లాస్టిక్‌ కాలుష్యం పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమించింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నివేదిక ప్రకారం భారత్‌ లో ఏటా యాబై ఆరులక్షల టన్నుల చెత్త పోగుపడుతుంది.ఈ స్థితి ఇలానే కొనసాగితే2020 నాటికి దేశములో 12 బిలియిన్ల చేత్తను శుభ్ర పరచడానికి వందల సంవ త్సరాలు పట్టవచ్చు నని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం తన సర్వే లోవ్యక్తం చేసింది. భూకాలుస్య నివారణ చర్యలు.. పెరుగు తున్న భూకాలుష్యాన్ని అరికట్టే చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలి.
1) పెరుగు తున్న జనాభాను అరికట్టాలి.
2) భూమి ఉత్పాదకతను పెంచాలి.
3) ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి.
4) ఐర్లాండ్‌ దేశములో మాదిరి ప్లాస్టిక్‌ వినియోగం పై భారీ జరిమానాలు విధించాలి.
5) మలేషి యాదేశంలో జరిమానాల మూలంగా ప్లాస్టిక్‌ వినియోగం 94 శాతం తగ్గింది.
6) చిత్తడి నేలల పెంపకం.
7) సామాజిక వనా ల పెంపకం.
8) చిట్టడవుల సంరక్షణ
9) ఉద్యాన వనాలు పబ్లిక్‌ పార్కులు

10) ప్రజల రిక్రియేషన్‌ సౌకర్యాలు పబ్లిక్‌ పార్కుల నిర్వ హణ పాలనలో నగరాలలో రెసిడెన్షియల్‌ అసోసియేషన్‌ లను భాగస్వామ్యం కలిగించాలి.
11) భూమి ‘ నీరు సహజ వనరుల సంరక్షణ ఉద్యమంగా కొనసాగాలి.
12)జీవావరణం పర్యావరణం కాలుష్య నియంత్రణ ఒకే కాలములో జరుగాలి.
13)ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన చైతన్య సదస్సులు ప్రభుత్వం స్వచంద సంస్థలు పౌరసమాజం యువత సామా జిక సాంస్కృతిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించాలి.
14) ప్రకృతి వ్యవసా యం విధానా లను గ్రామీణ ప్రాంతా లలో విస్తృత స్థాయిలో ప్రచారం చెయ్యాలి.
15) భూమిని కాలుష్యం పరిచే రసాయనిక ఎరువులవాడకాన్ని తగ్గించాలి.
16)నీటి నిలువ భూమీకోత నివారణ నిర్వహణ విదానాలమీధ అవగాహన సదస్సులు నిర్వహించాలి.
17) భూకాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకూడదు.భూమిప్రకృతి ప్రసాదితం . భూమి పై జనాభాను పెంచగలం’ కాని భూమిని పెంచలేం.
18) సంప్రదా యేతర ఇందన వనరుల వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలి. సోలార్‌ విద్యుత్‌ శక్తి ఉత్పత్తి.సామర్థ్యాన్ని పెంపొం దించే కార్యాచరణతో ప్రభుత్వాలు ముందుకు వచ్చి భూరక్షణే జన రక్షణ అన్న స్పృహను సమాజములో కలిగించాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు