Monday, May 20, 2024

ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్సెస్ స్వచ్చంద సేవా సంస్థఆధ్వర్యంలో భారత్ కె అనుమోల్ అవార్డులు..

తప్పక చదవండి
  • ఈనెల 31 నాడు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ జనపథ్,
    న్యూ ఢిల్లీలో కన్నుల పండుగగా కార్యక్రమ నిర్వహణ..
  • మీడియా పార్ట్ నర్ గా భాగస్వామ్యమైన ది న్యూస్ మ్యాగజైన్..
  • వివరాలు తెలియజేసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్సెస్ స్వచ్చంద సేవా సంస్థ
    వైస్ చైర్మన్ డా. మొహమ్మద్ నిజాముద్దీన్..

ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్సెస్ ఒక స్వచ్చంద సేవా సంస్థ, వైస్ చైర్మన్ డా. మొహమ్మద్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో.. ది న్యూస్ ఇంగ్లిష్ మాస పత్రిక మీడియా పార్ట్ నర్ గా వ్యవహరిస్తుండగా.. వీరిద్దరి సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 31 నాడు ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్, జనపథ్ లో భారత్ కె అనుమోల్ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తోంది.. కాగా ది న్యూస్ ఇంగ్లిష్ మాస పత్రిక గత 11 ఏళ్లుగా హైదరాబాద్కు జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక స్థానం కల్పించడంలో విజయం సాధించింది.. భారతదేశంలో ఎప్పటికప్పుడు కాల పరిస్థితులను బేరీజువేస్తూ అనేకానేక కథనాలను ఈ పత్రిక ప్రచురించింది.. ఈ 11 సంవత్సరాల్లో ఈ పత్రిక అన్ని వర్గాల పాఠకులను ఆకట్టుకుంది.. 50 లక్షల కంటే ఎక్కువ మందిని తన పాఠకులుగా మార్చుకోగలిగింది.. యాడ్ వెంచర్స్ డిజిటల్ మీడియా అనేది అడ్వార్టైజింగ్ లో నైపుణ్యం, గత 2 దశాబ్దాల నుండి వచ్చిన బ్రాండింగ్, కమ్యూనికేషన్లు హైదరాబాద్ లో పేరు గాంచిన సంస్థ.. ఇప్పుడు, యాడ్-వెంచర్స్ ది డిజిటల్ మీడియా సహకారంతో.. న్యూస్ భారత్ పేరుతో ప్రతిష్టాత్మక అవార్డు వేడుకను నిర్వహిస్తోంది.. భారత్ కె అనుమోల్ గా ఈ వేడుకకు నామకరణం చేశారు.. కాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు తనను నామినేట్ చేసినందుకు, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డి పేట సర్పంచ్, నావూరి వెంకట్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.. ఇంతటి భారీ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్సెస్ స్వచ్చంద సేవా సంస్థ వైస్ చైర్మన్ డా. మొహమ్మద్ నిజాముద్దీన్ కు అభినందనలు తెలిపారు..

ఈ అవార్డుల వేడుకలో పాల్గొన్న ప్రతి భారత పౌరుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది అన్నది నిర్విదాంశం.. దేశాభివృద్ధికి పాటుపడుతున్న రాష్ట్ర రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, పారిశ్రామికవేత్తలు లతో ఈ కార్యక్రమం జరుగనుంది.. ఈ అవార్డు వేడుక అనేది ప్రత్యేకమైన కస్టమ్-మేడ్ డిజైన్ అవార్డు. పబ్లిక్గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందడానికి అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఈ అవార్డుకు నామినేట్ చేయబడ్డారు.. ఈ అవార్డుల ఎంపిక అన్నది ఒక కఠినమైన ఎంపిక.. కానీ అన్ని ఎంట్రీల నుండి సరైన వ్యక్తులను, సంస్థలను ఎంపిక చేయడం జరిగింది.. ఈ ఈవెంట్ దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జిక్యూటివ్లు, ఇండస్ట్రీ లీడర్లు, డెసిషన్మేకర్స్, బిజినెస్ ఓనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు