Wednesday, April 24, 2024

బ్యాంకింగ్ సేవల మెరుగు..

తప్పక చదవండి

బ్యాంకింగ్‌ ఖాతాదారుల సేవల్ని మెరుగుపర్చేందుకు రిజర్వ్‌బ్యాంక్‌ కమిటీ సోమవారం కీలకమైన సిఫార్సులు చేసింది. కేవైసీ అప్‌డేట్‌, మృతిచెందినవారి వారసుల సెటిల్‌మెంట్‌ క్లెయింలు, పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్ల సమర్పణలో వెసులుబాటు కల్పించడం వంటివి ఈ సూచనల్లో ఉన్నాయి. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థల (ఆర్‌ఈలు-బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు) ఖాతాదారుల సేవల ప్రమాణాల్ని సమీక్షించేందుకు ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ బీపీ కనుంగో నేతృత్వంలో గత ఏడాది మే నెలలో కేంద్ర బ్యాంక్‌ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్‌ఈల ఇంటర్నల్‌ గ్రీవియెన్స్‌ రిడ్రెస్‌ (ఐజీఆర్‌)లో గత మూడేండ్లలో నమోదైన ఫిర్యాదుల్ని కమిటీ సమీక్షించింది.

రుణ ఖాతాను క్లోజ్‌ చేసిన తర్వాత ఖాతాదారులకు ఆస్తి పత్రాల్ని నిర్దిష్ఠ కాలపరిమితిలో తిరిగి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఆర్‌ఈపై పెనాల్టీ విధించాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్లు కన్పించకపోతే, ఆ డాక్యుమెంట్ల రిజిష్టర్డ్‌ కాపీలను ఆర్‌ఈలు సొంత ఖర్చుతో తీసి ఇవ్వాలి. జాప్యం జరిగితే ఖాతాదారుకు తగిన పరిహారం చెల్లించాలి. ఖాతాదారుల రిస్క్‌ వర్గీకరణకు ఆర్‌ఈలు తగిన విధానాన్ని అవలంబించాలి. ఉదాహరణకు వేతన జీవుల ఖాతాల్లో నిరంతరం డిపాజిట్లు, విత్‌డ్రాయిల్స్‌ ఉన్నంతమాత్రాన, వారిని అధిక రిస్క్‌గల ఖాతాదారులుగా వర్గీకరించరాదని సూచించింది. పెన్షనర్లు వారి పెన్షన్‌ ఖాతా ఉన్న బ్యాంక్‌కు చెందిన ఏ శాఖలోనైనా లైఫ్‌ సర్టిఫికెట్‌ (ఎల్‌సీ) సమర్పించుకునే అవకాశం కల్పించాలని కమిటీ సూచించింది. అలాగే ఒక నిర్ణీత నెలలో రద్దీని బ్యాంక్‌లు నివారించేందుకు.. ఖాతాదారులు కోరుకునే ఏ నెలలోనైనా ఎల్‌సీని ఇచ్చే వెసులుబాటు ఇవ్వాలన్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు