- ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నడు
- కరీంనగర్ ప్రజల మనోగతం
- ఇంటింటికీ బీజేపీ పేరుతో సొంత వార్డులో ప్రచారం చేస్తున్న బండి సంజయ్
- ఇంటింటికీ తిరుగుతూ మోదీ పాలనపై కరపత్రాలు అందిస్తూ,
స్టిక్కర్లు అంటిస్తూ బీజీబిజీగా గడిపిన బండి - ఉదయం 11 గంటలకు వంద కుటుంబాలకుపైగా కలిసిన బండి..
- రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల సమయానికి 20 లక్షల కు‘టుంబాలను కలిసిన బీజేపీ కార్యకర్తలు
- పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు… రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఇంటింటికీ తిరుగుతున్న వైనం
హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
‘‘బండి సంజయ్ అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలే. అదే పలకరింపు, అదే ఆప్యాయత. అదే చిరునవ్వు. కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఎట్లున్నడో… ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడైనంక కూడా అట్లనే సాదా సీదాగా ఉన్నడు. సంజయ్ మేం తయారు చేసిన నాయకుడు.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటడు. సంజయ్ ను చూస్తుంటే మస్త్ సంతోషంగా ఉంది’’
‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని తన సొంత వార్డు(చైతన్యపురి, జ్యోతినగర్)లో ఇంటింటికీ తిరుగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను చూసి అక్కడి స్థానికులు వ్యక్తం చేసిన మనోభావాలివి. ‘‘బండి సంజయ్ చూస్తే మా ఇంట్ల మనిషిలెక్కనే అనుకుంటం. కార్పొరేటర్ నుండి ఈ స్థాయికి ఎదిగినా అభిమానమే తప్ప అహంకారం కన్పించదు. మేం కార్పొరేటర్ గా గెలిపించినం. ఒక్క మాటలో చెప్పాలంటే మేం తయారు చేసిన నాయకుడు బండి సంజయ్. ఇయాళ ఈ స్థాయికి ఎదిగిండంటే మాకు మస్తు సంతోషంగా ఉంటుంది.’’అంటూ చైతన్యపురి, జ్యోతినగర్ లో నివసిస్తున్న జమున, క్రిష్ణారెడ్డి, వంశీధర్ రెడ్డి, వేణుగోపాల్, శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, హరి ప్రసాదరావు వ్యాఖ్యానించారు. మరోవైపు ఇంట్లో చిన్న పిల్లలు కన్పించగానే వాళ్లతో మమేకమైతూ బండి సంజయ్ నవ్విస్తుంటారు. ఇంటింటికీ బిజేపీ ప్రచారంలో భాగంగా పలు ఇండ్లలో చిన్న పిల్లలు బండి సంజయ్ ను చూడగానే ‘‘సంజయ్ మామా ఎట్లున్నవ్? నువ్వు నా దోస్త్ అంటూ’’ దగ్గరకు రావడం కన్పించింది. సంజయ్ సైతం వాళ్లతో చిన్నపిల్లాడిలా కలిసిపోతూ వాళ్ల చదువు, ఆటపాటల గురించి ఆరాతీస్తూ జోష్ నింపుతున్నారు. మొత్తంగా సంజయ్ ను చూడగానే జ్యోతినగర్, చైతన్యపురి కాలనీ ప్రజలు ఆనందంతో ఇంట్లోకి స్వాగతం పలుకుతూ ఆశీర్వదించడం కన్పించింది.
ఉదయం 11 గంటల సమాయానికి బండి సంజయ్ 70కిపైగా కుటుంబాలను కలిసి వారికి స్వయంగా మోదీ 9 ఏళ్ల పాలనపై కరపత్రాలు అందించడంతోపాటు వారి ఇంటి తలుపులు, గోడలపై స్టిక్కర్లు అంటించారు. అదే సమయంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలను ఆరా తీశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సమాచారం మేరకు… ఉదయం 11 గంటల సమయానికి దాదాపు 20 లక్షల కుటుంబాలను బీజేపీ శ్రేణులు కలిసినట్లు బండి సంజయ్ వెల్లడించారు.