Saturday, July 27, 2024

చెట్ల పొదల్లో పసికందు

తప్పక చదవండి
  • మనసు ఎలా వచ్చిందో ఆ కన్న తల్లికి…
  • చెట్ల పొదల్లో అరుపులు, కేకలు..
  • 108కి సమాచారం ఇచ్చిన గ్రామస్తులు..
  • సూర్యాపేట మాత, శిశు కేంద్రానికి అప్పగించిన 108 సిబ్బంది రమేష్‌, చిరంజీవి..
  • ఆడపిల్లను వదిలించుకోవాలనుకున్న తల్లి ఎవరు?.
    సూర్యాపేట : సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్న ఇంకా ఆడపిల్లలను వదిలించు కోవాలని చూస్తున్నారు కొందరు గుండెలేని రాతి మనుషులు..ఆడపిల్లలు లేకుంటే సమాజంలో మగవారు ఉంటారా.? అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్ల పొదల్లో వదిలివేసిన తల్లికి పలువురు శాపనార్థాలు పెడుతున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్‌) మండలం, నిమ్మికల్‌ గ్రామంలో జరిగింది.108 సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం నెమ్మికల్‌ గ్రామ చెట్ల పొదలలో అర్ధరాత్రి వేళ అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వేసినట్లు చెప్తున్నారు.సోమవారం తెల్లవారు జామున బహిర్బుమికి వెళ్లిన గ్రామానికి చెందిన కొందరు చూసి,108 కి సమాచారం ఇవ్వడంతో, సిబ్బంది రమేష్‌, చిరంజీవి వెళ్లి పాపను ప్రథమ చికిత్స చేస్తూ, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆస్పటల్‌ సిబ్బందికి అప్పగించారు. పాప క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నట్లువారు తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు