ఉమ్మడి కరీంనగర్ బ్యూరో :కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బి. గోపి భాద్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆర్.వి. కర్ణన్ నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అవడంతో, జిల్లా నూతన కలెక్టర్‌గా డా: బి. గోపిని ప్రభుత్వం నియమించింది, ఈ సందర్భంగా బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలను బి.గోపి స్వీకరించారు. అంతకు ముందు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ కు అయన చేరుకోగా అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం అయన రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫ రాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి, మానకోండుర్ శాసన సభ్యులు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమం లో అదనపు కాలేక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ఆర్‌డిఓ మహేష్, ఏ ఓ జగత్ సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.