Monday, October 14, 2024
spot_img

ఆసియా గేమ్స్‌కు నిఖత్‌ జరీన్‌..

తప్పక చదవండి

ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌కు భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఎంపికైంది. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ కోసం భారత బాక్సింగ్‌ సమాఖ్య(బీఎఫ్‌ఐ) శనివారం జట్టును ప్రకటించింది. మొత్తం 13 మంది బాక్సర్లను ఎంపిక చేయగా, ఇందులో ఆరుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మెరువడం ద్వారా తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌జరీన్‌..ఆసియా గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించింది. వరుసగా రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్‌ టైటిల్‌ దక్కించుకున్న నిఖత్‌..ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకంపై కన్నేసింది.

తద్వారా వచ్చే ఏడాది జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా బెర్తు దక్కించుకునేందుకు పట్టుదలతో కనిపిస్తున్నది. మరోవైపు ఇటీవల జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ టోర్నీలో గాయపడ్డ ఇందూరు బాక్సర్‌ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ ఆసియాగేమ్స్‌కు దూరమయ్యాడు. జట్టు: నిఖత్‌జరీన్‌(51కి), ప్రీతి పవార్‌(54కి), పర్వీన్‌ హుడా(57కి), జాస్మిన్‌ (60కి), అరుంధతి చౌదరి(66కి), లవ్లీనా బొర్గోహై(75కి), దీపక్‌ బోరియా(51కి), సచిన్‌ సివాచ్‌(57కి), శివ తాపా(63.5కి), నిశాంత్‌దేవ్‌(71కి), లక్ష్య చాహర్‌(80కి), సంజీత్‌(92కి), నరేందర్‌ బెర్వాల్‌(+92కి)

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు