Saturday, July 27, 2024

హీరో సుహాస్‌ శ్రీరంగనీతులు ఫస్ట్‌లుక్‌ పోస్టర్..

తప్పక చదవండి

షార్ట్‌ ఫిలింస్‌, యూట్యూబ్‌ వీడియోస్‌తో కెరీర్‌ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్‌. ‘కలర్‌ ఫోటో’ సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ సాధించాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు టాలీవుడ్‌ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఇటీవలే రైటర్‌ పద్మభూషణ్‌తో థియేటర్‌ హిట్టును కొట్టేశాడు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో సుహాస్‌కు పది కోట్ల మార్కెట్‌ ఏర్పడింది. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో శ్రీరంగనీతులు ఒకటి.

ప్రవీణ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తిక్‌ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. సుహాస్‌, కార్తిక్‌ రత్నంతో పాటు నటి రుహాని శర్మ ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పోస్టర్‌ చూస్తుంటే ట్రైంగిల్‌ లవ్‌స్టోరీ అని తెలుస్తుంది. రాధావి ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై వెంకటేశ్వర రావు బల్‌మూరి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్‌ కానుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు